బ్రహ్మోత్సవంతో మహేష్ కొత్త రికార్డు..!
on May 23, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ బ్రహ్మోత్సవం సినిమాతో మహేష్ కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారంతో సినిమా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ల కలెక్షన్ దాటింది. బ్రహ్మోత్సవంతో కలుపుకుని వరసగా ఆరు మహేష్ సినిమాలు మిలియన్ డాలర్ మార్కును దాటాయి. ఇది మొత్తం సౌత్ ఇండియాలో ఎవరికీ లేని రికార్డు. దూకుడుతో మొదలైన మహేష్ ఒవర్సీస్ మిలియన్ డాలర్ ప్రస్తానం వరసగా సీతమ్మ వాకిట్లో, నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు, ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాలతో అప్రతిహతంగా కొనసాగింది. బ్రహ్మోత్సవం రిజల్ట్ తో డీలా పడ్డ మహేష్ ఫ్యాన్స్ కు ఈ రేర్ ఫీట్ కాస్త ఎంకరేజ్ మెంట్ ఇచ్చింది. హిట్టై ఉంటే రికార్డులు ఎలా ఉండేవో అంటూ నిట్టూరుస్తున్నారు. మొదటి రోజే విపరీతమైన డివైడ్ టాక్ తో మొదలైన బ్రహ్మోత్సవం డిస్ట్రిబ్యూటర్లు ఏదైనా మ్యాజిక్ జరిగితే తప్ప కోలుకునేలా కనిపించడం లేదు. అంచానాలున్న సినిమా కావడంతో భారీగా డబ్బు పెట్టేసిన బయ్యర్లందరూ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.