Home

»

Latest News

మహేశ్ కొరటాల మూవీ ఓపెనింగ్‌కి అందుకే రాలేదా..?

Nov 11, 2016 1:46PM

సెంటిమెంట్..మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేవరకు ఎన్నో అంశాలను సెంటిమెంట్‌ను ఫాలోఅవుతాడు. అలాగే సినీ పరిశ్రమ కూడా దానికి మినహాయింపు కాదు. బుధవారం రిలీజ్ చేస్తే సినిమా హిట్టవుతుందని..టైటిల్ చివర సున్నా ఉంటే బ్లాక్ బస్టరేనని ఇలా ఎన్నో సెంటిమెంట్లు మన టాలీవుడ్ సినీ ప్రముఖుల విషయంలో వింటూ ఉంటాం. అమ్మాయిల కలల రాకుమారుడిగా..సూపర్‌స్టార్‌గా నీరాజనాలందుకుంటున్న మహేశ్ బాబుకు కూడా బోలెడు సెంటిమెంట్లు ఉన్నాయి. కెరిర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేటి దాకా మహేశ్ షూటింగ్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉంటాడు.

తాజాగా శ్రీమంతుడితో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన కొరటాల-మహేశ్ కాంభినేషన్ మరోసారి రిపీట్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ రామానాయుడు స్టూడియోలో బుధవారం ప్రారంభమైంది. అయితే ఎప్పటిలాగే మహేశ్ సినిమా ఓపెనింగ్‌కు రాకుండా తన బదులు సతీమణి నమ్రతను అక్కడికి పంపారు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను డి.వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మురుగదాస్‌ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్న మహేశ్ అది పూర్తయిన వెంటనే కొరటాలతో కలవనున్నారు. మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తారని ప్రచారం జరుగుతున్న ఈ సినిమాను జూలై లేదా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com