
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ముద్దుల కుమారుడు గౌతమ్ ఘట్టమనేని 20వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
"హ్యాపీ 20 GG!! నువ్వు నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నావు. నీ కలలను ధైర్యంతో సాధించు. నిన్ను చూస్తుంటే ప్రతిరోజూ గర్వంగా ఉంటుంది" అంటూ మహేష్ బాబు రాసుకొచ్చిన లవ్లీ క్యాప్షన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఈ పోస్ట్‌కి మహేష్ బాబు తన కొడుకు గౌతమ్‌తో కలిసి నడుస్తున్న ఒక బ్యూటిఫుల్ ఫోటోను జత చేశారు. ఇద్దరూ ప్రశాంతమైన వాతావరణంలో, అందమైన ప్రకృతి ఒడిలో వెనకనుంచి కలసి నడుచుకుంటూ వెళ్తున్న ఈ పిక్ బ్యూటిఫుల్ గా ఉంది.
గౌతమ్ తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా ఎంతో ప్రేమగా స్పందిస్తూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ప్రత్యేక పోస్ట్ చేశారు. "నిన్ను నా కుమారుడిగా చెప్పుకోవడం నాకు ఎంతో గర్వకారణం. నీ కలలు, లక్ష్యాలన్నీ నువ్వు సాధించాలని కోరుకుంటున్నాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను." నమ్రత రాసుకొచ్చారు.
గౌతమ్ కూడా త్వరలోనే తన తండ్రిలాగే టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడని సినీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఎక్కువగా స్టార్ కిడ్స్ 20-25 ఏళ్ళ మధ్య హీరోలుగా ఎంట్రీ ఇస్తుంటారు. ఇప్పుడు గౌతమ్ కి 20 ఏళ్ళు రావడంతో.. ఫ్యాన్స్ కూడా ఈ ఘట్టమనేని వారసుడి ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
[Mahesh Babu, Twitter, Gautam Ghattamaneni, Birthday, Namrata Shirodkar, Instagram, Telugu Film News, Telugu News]





