Home

»

Latest News

గ్లోబల్ స్టార్: 'వారణాసి'తో చరిత్ర తిరగరాయనున్న మహేష్ బాబు.!

Aug 8, 2026 4:06PM

- కుంభస్థలాన్ని కొట్టబోతున్న మహేష్ బాబు
- రీజినల్ సినిమాలతోనే రికార్డులు సృష్టించిన 'రాజకుమారుడు'
- గ్లోబల్ స్టార్ గా అవతరించడానికి పర్‌ఫెక్ట్ స్కెచ్

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. అనతికాలంలోనే "తండ్రికి తగ్గ తనయుడు" అని నిరూపించారు. 'రాజకుమారుడు'గా ఎంట్రీ ఇచ్చి, తన మొదటి సినిమాతోనే రికార్డుల బోణి కొట్టిన మహేష్.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 'మురారి', 'ఒక్కడు', 'పోకిరి', 'దూకుడు', 'శ్రీమంతుడు'.. ఇలా ఒకటా రెండా?.. ఆయన చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. 'తండ్రికి తగ్గ తనయుడు' అనిపించుకోవడమే కాదు, టాలీవుడ్ బాక్సాఫీస్‌కు అసలైన 'రాజకుమారుడు'గా నిలిచారు.

గత కోనేళ్ళుగా స్టార్స్ అంతా పాన్ ఇండియా జపం చేస్తున్నారు. కానీ, పాన్ ఇండియా సినిమాలు చేయకుండానే.. కేవలం తెలుగు సినిమాలతోనే రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన ఘనత మహేష్ బాబుది. రీజినల్ కంటెంట్ తోనే.. అత్యధికంగా 100 కోట్ల షేర్ సినిమాలను సొంతం చేసుకున్న హీరోగా  టాలీవుడ్ రికార్డులను తిరగరాశారు.

అసలు పాన్ ఇండియా మార్కెట్‌లోకి వెళ్లకుండానే మహేష్ రేంజ్ ఈ స్థాయిలో ఉంటే.. ఇక ఇప్పుడు ఆయన కన్ను గ్లోబల్ మార్కెట్ పై పడింది. ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' అనే భారీ గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. 

అనౌన్స్ మెంట్ వచ్చినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. హాలీవుడ్ కటౌట్, ఎవర్గ్రీన్ చార్మింగ్ లుక్స్ ఉన్న మహేష్ బాబు.. రాజమౌళి మార్క్ వరల్డ్ క్లాస్ విజన్‌తో కలిస్తే ఆ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికే గూస్‌బంప్స్ వస్తున్నాయి.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం.. 'వారణాసి' సినిమా కలెక్షన్ల లెక్క ఏకంగా రూ.2000 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇండియన్ సినీ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ, గ్లోబల్ బాక్సాఫీస్‌పై తెలుగు సినిమా జెండాను గర్వంగా ఎగరవేసే ప్రాజెక్ట్‌గా ఇది నిలవబోతోందనే అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకోవడమే కాకుండా, సరికొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసిన మహేష్ బాబు.. ఇప్పుడు 'వారణాసి'తో గ్లోబల్ లెవెల్ సక్సెస్ సాధిస్తే, ఇక ఆయన  రేంజ్ ఎవరికీ అందనంత ఎత్తుకి చేరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

'వారణాసి'తో మహేష్ బాబు గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకోవడమే కాకుండా.. ఆయన లుక్స్, సెటిల్డ్ పర్ఫామెన్స్ కి ఫిదా అయ్యి.. హాలీవుడ్ ఆఫర్స్ క్యూ కట్టినా ఆశ్చర్యంలేదు.

మహేష్ బాబు గ్లోబల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ.. ఆగష్టు 9న పుట్టినరోజు జరుపుకుంటున్న ఆయనకు 'తెలుగువన్' తరపున శుభాకాంక్షలు.

 

 

Mahesh Babu, Birthday, Varanasi Movie

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com