నాది సింపుల్... బోరింగ్ లైఫ్
on Feb 18, 2020
మహేష్ బాబు సూపర్ స్టార్. కో అంటే కోట్లు వచ్చి పడతాయి. ఒక యాడ్ చేసినా... సినిమాలో నటించినా... కోట్లకు కోట్లు పారితోషికం వచ్చి పడుతుంది. డబ్బులు పక్కన పెడితే కోట్లాది మంది అభిమాన గణం మహేష్ సొంతం. సినిమాలు, అభిమానులు పక్కన పెడితే మహేష్ బాబుది హ్యాపీ ఫ్యామిలీ. బంగారంలాంటి భార్య, ఆణిముత్యాల్లాంటి పిల్లలు, సూపర్ స్టార్ ఫాదర్... ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు, మహేష్ బాబు పర్సనల్ లైఫ్ కూడా సక్సెస్ ఫుల్ జర్నీ అని చెప్పాలి. ఆయన జీవితంలో బోలెడు సంగతులు ఉంటాయని ఫాన్స్, ఆడియన్స్ అనుకుంటారు. కానీ, మహేష్ బాబు మాత్రం తనది సింపుల్ అండ్ బోరింగ్ లైఫ్ అంటున్నారు. 'మీ జీవితంపై బయోపిక్ తీస్తే... అందులో మీరు నటిస్తారా?' అని మహేష్ బాబుకు లేటెస్టుగా ఒక ప్రశ్న ఎదురైంది. అప్పుడు ఆయన "నాది చాలా సింపుల్, బోరింగ్ లైఫ్. నా మీద బయోపిక్ తీస్తే వర్క్ అవుతుందని అనుకోను" అని సమాధానం ఇచ్చారు. వెకేషన్ కి వెళ్ళడానికి ఫ్యామిలీతో కలిసి ఉంటే చాలు అని, లొకేషన్ ఎక్కడ అనేది పట్టించుకోనని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న మహేష్, మరో రెండు మూడు నెలల్లో కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
Also Read