Home

»

Latest News

‘మహాకాళి’ గ్లింప్స్: సంక్రాంతికి ప్రశాంత్ వర్మ మరో షాక్ ఇవ్వబోతున్నాడా.?

Aug 25, 2026 4:10PM

‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ క్రియేటర్ గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘మహాకాళి’. ఈ చిత్రానికి సంబంధించిన "శుక్రాచార్యాస్ వార్ క్రై" (Shukracharya's War Cry) పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

దాదాపు మూడు నిమిషాల నిడివితో ఉన్న ఈ గ్లింప్స్ కంటెంట్ పరంగా, విజువల్స్ పరంగా సర్ప్రైజ్ చేసిందని చెప్పవచ్చు. ఈ మైథలాజికల్ సోషియో-ఫాంటసీ చిత్రంలో.. అసుర గురువు శుక్రాచార్యుడి పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు. ఆయన లుక్, గాంభీర్యం, వాయిస్ ఓవర్ గ్లింప్స్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

అమృత మథనం సమయంలో దేవుళ్లు దానవులకు చేసిన అన్యాయం, ఇంద్రాసనం అపహరణ, చతుర్దశ లోకాల ద్వారాలు మూసివేసిన తీరును శుక్రాచార్యుడు గుర్తుచేస్తూ.. "మానవ జాతిని సర్వనాశనం చెయ్" అంటూ రక్తబీజుడుకి పిలుపునిస్తాడు.

ఇక గ్లింప్స్ చివరిలో నటి శ్రియా రెడ్డి ఉగ్ర రూపంలో అమ్మవారిగా కనిపించారు. పసిపాపను చేతుల్లో పట్టుకుని, బహు హస్తాలతో వివిధ ఆయుధాలను ధరించిన ఆమె లుక్ గ్లింప్స్ కే హైలైట్ గా నిలిచింది.

ప్రశాంత్ వర్మ కథాంశంతో, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 8, 2027 న థియేటర్లలో విడుదల కానుంది.

2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్’, పెద్ద సినిమాలకు షాకిస్తూ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘మహాకాళి’ గ్లింప్స్‌కి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అమ్మవారి ఉగ్రరూపంతో థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే ‘హనుమాన్’ మాదిరిగానే, 2027 సంక్రాంతికి ‘మహాకాళి’ సర్ప్రైజ్ చేసే అవకాశముంది.

 

 

 

Mahakali Glimpse, Shukracharya, Prasanth Varma, Akshaye Khanna, Sriya Reddy

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com