Home

»

Latest News

Made in Korea Review:మేడిన్ కొరియా మూవీ రివ్యూ

Mar 14, 2026

 

మూవీ : మేడిన్ కొరియా
నటీనటులు: ప్రియాంక మోహన్,  పార్క్ హే-జిన్, సి-హున్ బేక్, రిషికాంత్ తదితరులు
ఎడిటింగ్: ఆంథోని
సినిమాటోగ్రఫీ: ప్రసన్న కుమార్
మ్యూజిక్: ధరణ్ కుమార్
నిర్మాతలు: శ్రీనిధి సాగర్
దర్శకత్వం: రా. కార్తీక్
ఓటీటీ: నెట్ ఫ్లిక్స్

కథ: 

శెన్బా (ప్రియాంక అరుళ్ మోహన్) తమిళనాడులోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన యువతి. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేని ఒక విలేజ్ లో ఆమె నివసిస్తూ ఉంటుంది. కొండ ప్రాంతంలోని ఆ గ్రామంలో ఆమె తండ్రి ఒక చిన్నపాటి హోటల్ నడుపుతూ ఉంటాడు. చాలాకాలం క్రితం కన్యాకుమారి  నుంచి కొరియా వెళ్లిన ఒక రాణిగారి పాత్రను స్కూల్ వార్షికోత్సవంలో శెన్బా పోషిస్తుంది. ఆ పాత్ర ఆమెపై చాలా ప్రభావం చూపిస్తుంది. అప్పటి నుంచి ఆమెకి 'కొరియా' చూడాలనే ఒక కోరిక పుడుతుంది. వయసుతో పాటే ఆ కోరిక బలపడుతుంది. అయితే మణి అనే అబ్బాయిని ప్రేమిస్తుంది శెన్బా. తల్లిదండ్రులతో చెప్పకుండా మణితో కలిసి కొరియాకి వెళ్ళాలనుకుంటుంది. అయితే మణి మాత్రం తనని డబ్బు కోసమే ప్రేమించినట్టు నటిస్తాడు. ఇక ఒక్కతే కొరియాకి వెళ్తుంది శెన్బా‌. మరి ఊరు కాని ఊరు.. దేశం కానీ దేశంలో శెన్బా ఎలా సర్వైవ్ అయింది అనేది మిగతా కథ.


విశ్లేషణ: 

ప్రతీ ఒక్కరికి బాల్యం నుండి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. అందులో ఒకటి పెద్దయ్యాక నెరవేర్చుకోవాలని అనుకుంటారు. అలాగే ఈ కథలో హీరోయిన్ శెన్బా దేశం కానీ దేశంలో , ప్రేమించిన వ్యక్తి నమ్మించి మోసం చేస్తే తనకి ఎదురైన కష్టాలని దాటుకొని తను ఎలా లైఫ్ లో నిలబడిందనేది ఈ సినిమా కథ. 

సినిమా మొదట్లో కాస్త బాగున్నప్పటికి శెన్బా, మణిల లవ్ ట్రాక్ అంతగా ఇంపాక్ట్ చూపించదు. ఇక కొరియాకి వెళ్ళాక కథగా వేగంగా మందుకు సాగుతుంది. శెన్బా తన నటనతో కట్టిపడేసింది ఇక్కడే. తనకి వచ్చిన కష్టాలని లెక్కచేయకుండా తనకి తోచిన సాయం చేస్తూ వెళ్ళిన హీరోయిన్ లైఫ్ ఎలా మారిందో దర్శకుడు చూపించిన తీరు బాగుంది. అయితే బామ్మ క్యారెక్టర్ కి ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్ కి వెళ్ళేసరికి జనాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు‌. సినిమా చివర్లో
కలుపుకుంటూ పోతే గెలుపు నీదే అవుతుంది అనే మెసెజ్ ని ఇచ్చారు. 

ఈ సినిమాకి ఇంకో ప్లస్ ఏంటంటే నిడివి.. ఇది రెండు గంటల లోపే ఉంది. సాధారణంగా ఇలాంటి కథలని ఎంత తక్కువ నిడివితో ఫినిష్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే జనాలకి బోర్ అనిపిస్తుంది. కానీ దర్శకుడు ఎక్కడా ఆ ఫీల్ రాకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే మధ్యలో కొన్నిచోట్ల క్యారెక్టర్ సహజత్వాన్ని ఆడియన్ కి కనెక్ట్ చేయడానికి డీప్ గా చూపించాడు. ఇలా అక్కడక్కడా నిదానంగా నడిచినట్టు అనిపించినా, ఫీల్ మిస్సవ్వకుండా తీసుకెళ్ళాడు దర్శకుడు. ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమా ఇది. అసభ్య పదజాలం వాడలేదు. అశ్లీల దృశ్యాలు లేవు. ఎడిటింగ్ బాగుంది. మ్యూజిక్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు: శెన్బాగా ప్రియాంక మోహన్ ఒదిగిపోయింది. మిగిలిన వాళ్ళంతా తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు. 


ఫైనల్ గా :  వన్ టైమ్ వాచెబుల్

రేటింగ్ : 2.5 /5 

✍️. దాసరి మల్లేశ్
 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com