Home

»

Latest News

అల్లరి నరేష్ కొత్త మూవీ "మడత కాజా"

Apr 10, 2011 12:37PM

అల్లరి నరేష్ కొత్త మూవీ "మడత కాజా" అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే అల్లరి నరేష్ హీరోగా నటింవబోయే కొత్త మూవీకి "మడత కాజా" అన్న పేరుని నిర్ణయించారట. శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై, ఇటీవల నాని హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్ గా, నందినీ రెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ, కె.యల్. దామోదర ప్రసాద్ "అలా మొదలైంది" అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. చిన్నచిత్రంగా విడుదలై చాలా పెద్ద హిట్టయిన చిత్రంగా ఇది చరిత్ర సృష్టిస్తూంది.

 

ఈ చిత్రం త్వరలో శతదినోత్సవం జరుపుకోబోతోంది. ఆ చిత్ర నిర్మాత దామోదర ప్రసాద్ తన శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై అల్లరి నరేష్ హీరోగా, సీతారామరాజు అనే నూతన యువకుణ్ణి దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మిచబోయే చిత్రానికి "మడత కాజా" అన్న పేరుని నిర్ణయించారట. ఈ "మడత కాజా" చిత్రం అల్లరి నరేష్ ఇమేజ్‍ కి తగ్గట్టే పూర్తిస్థాయి హాస్యరసభరిత చిత్రమని అంటున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com