Home

»

Latest News

maa inti bangaram: షాక్ ఇస్తున్న మా ఇంటి బంగారం కలెక్షన్స్.. రెండో రోజు ఇంతే 

Jun 21, 2026 11:55AM


స్టార్ హీరోయిన్  సమంత,  నందిని రెడ్డి కలిసి మొన్న 19 న 'మా ఇంటి బంగారం' తో థియేటర్స్ లో లాండ్ అయిన విషయం తెలిసిందే. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కగా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లని సాధిస్తోంది. సాధారణ గృహిణిగా చీరకట్టులో కనిపిస్తూనే, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయుధం పట్టిన అస్సాసిన్ (హంతకురాలు)  గా  సమంత ప్రదర్శించిన పెర్ఫార్మ్ కి ఫ్యాన్స్, ప్రేక్షకులు  ఫిదా అవుతున్నారు.

 మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఈ సినిమా కలెక్షన్లలో ఏకంగా 40.2 శాతంగ్రోత్ నమోదు కావడం ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరుస్తోంది.  మొదటి రోజు శుక్రవారం నాడు ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం 5.35 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించగా, శనివారం నాటి రెండవ రోజున ఏకంగా 7.50 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. దీనితో కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా మొత్తం ఇండియా నెట్ కలెక్షన్స్ 12.85 కోట్ల రూపాయలకు చేరుకోగా, దేశీయ గ్రాస్ కలెక్షన్స్ 14.90 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధికంగా వసూళ్లు వస్తున్నాయి. 


Also read: Nandamuri mokshagna: నందమూరి మోక్షజ్ఞకి యాక్టింగ్‌ ఇంట్రస్ట్‌ లేదా? అసలు నిజం ఇదే!


రెండవ రోజు వచ్చిన 7.50 కోట్ల నెట్ కలెక్షన్లలో కేవలం తెలుగు వెర్షన్ నుంచే 7.15 కోట్ల రూపాయలు రావడం విశేషం. మిగిలిన 35 లక్షల రూపాయలు తమిళ వెర్షన్ ద్వారా లభించాయి. శనివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2,023 షోలలో 51 శాతం అక్యుపెన్సీ నమోదు కావడం సమంత బాక్సాఫీస్ స్టామినాని  నిరూపిస్తోంది.  కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్లలో కూడా "మా ఇంటి బంగారం" గట్టి పట్టు సాధించింది. శనివారం ఒక్క రోజే ఓవర్సీస్ లో 4.00 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు కాగా, రెండు రోజుల మొత్తంగా విదేశీ గ్రాస్ వసూళ్లు 10.60 కోట్ల రూపాయలకు చేరాయి. దీనితో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు రోజుల్లోనే 25.50 కోట్ల రూపాయల గ్రాస్ మార్కుని దాటి సునామీ సృష్టిస్తోంది. సమంత తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్', రాజ్ అండ్ డికె, హిమాంక్ రెడ్డి దువ్వురులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. గుల్షన్ దేవయ్య విలనిజం, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. వీకెండ్ ముగిసే సమయానికి ఈ కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com