
కాంబినేషన్లకు మన తెలుగు చిత్రసీమలో ఎప్పుడూ పెద్ద ముందుంటుంది. కథలో క్లారిటీ లేకపోయినా పర్లేదు కానీ కాంబినేషన్ లో కిక్ లేకపోతే మాత్రం రూపాయి పెట్టడానికి కూడా ఆలోచిస్తారు మన నిర్మాతలు. అందుకే దర్శకులు కూడా క్రేజీ కాంబినేషన్ల వెంట పరుగులు తీస్తుంటారు. ఇప్పటికే మూడుసార్లు కలిసి నటించిన ఎన్టీయార్-సమంత (బృందావనం, రభస, రామయ్య వస్తావయ్య) నాలుగోసారి కలిసి నటిస్తున్న చిత్రం "జనతా గ్యారేజ్". కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో ఉంది.
ఈ సినిమాకి మరో విశేషం కూడా ఉంది. "నాన్నకు ప్రేమతో" అనంతరం ఎన్టీయార్, "అ ఆ" అనంతరం సమంత నటిస్తున్న "26వ" సినిమా "జనతా గ్యారేజ్". ఇలా చిత్రంలో నటిస్తున్న హీరోహీరోయిన్లిద్దరికీ ఒక సినిమా కౌంట్ ప్రకారంగా సింక్ అవ్వడం బహుశా ఇదే తొలిసారి అనుకుంటా. ఆగస్ట్ 12న ఆడియో విడుదల జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు!




.jpg)
.jpg)
