Home

»

Latest News

`విక్ర‌మ్`తో వ‌రుస‌గా నాలుగో విజ‌యం!

Jun 6, 2022 2:49PM

తీసింది నాలుగు సినిమాలే అయినా.. త‌మిళ‌నాట త‌న ప్ర‌తీ చిత్రంతోనూ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌క‌రాజ్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. సందీప్ కిష‌న్, శ్రీ‌, రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన కోలీవుడ్ వెంచ‌ర్ `మాన‌గ‌రం` (2017)తో ద‌ర్శ‌కుడ‌య్యాడు లోకేశ్. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన స‌ద‌రు చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే కాకుండా.. డీసెంట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఆపై కార్తి కాంబినేష‌న్ లో చేసిన `ఖైదీ` (2019)తో అటు త‌మిళ‌తంబీల‌ను, ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు లోకేశ్. త‌న ఖాతాలో ఓ మెమ‌ర‌బుల్ హిట్ క్రెడిట్ చేసుకున్నాడు. ఇక గ‌త ఏడాది సంక్రాంతికి వ‌చ్చిన విజ‌య్ `మాస్ట‌ర్` (2021)తో హ్యాట్రిక్ అంకాన్ని పూర్తిచేసుకున్నాడు. తెలుగులోనూ ఈ కోలీవుడ్ ప్రాజెక్ట్.. మంచి వ‌సూళ్ళు ఆర్జించింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్, విజ‌య్ సేతుప‌తి, ఫ‌హ‌ద్ ఫాజిల్, సూర్య (అతిథి పాత్ర‌) వంటి భారీ తారాగ‌ణంతో తీర్చిదిద్దిన `విక్ర‌మ్` కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. మొత్త‌మ్మీద‌.. వ‌రుస‌గా నాలుగు విజ‌యాల‌తో త‌మిళ‌నాట వార్త‌ల్లో నిలుస్తున్నాడు లోకేశ్. మ‌రి.. రాబోయే చిత్రాల‌తోనూ ఈ టాలెంటెడ్ కెప్టెన్ ఇదే శైలిని కొనసాగిస్తాడేమో చూడాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com