Home

»

Latest News

'DC' ట్రైలర్ అదిరిపోయింది.. లోకేష్ కనగరాజ్ విశ్వరూపం!

May 15, 2026 7:19PM

కోలీవుడ్ నుంచి మరో భారీ యాక్షన్ చిత్రం రాబోతోంది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) నటుడిగా మారుతూ, అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'DC'. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. (DC Trailer)

ట్రైలర్ ప్రారంభం నుంచే అరుణ్ మాతేశ్వరన్ మార్క్ యాక్షన్, లోకేష్ కనగరాజ్ ఇంటెన్సిటీ కనిపిస్తోంది. ఇందులో లోకేష్ 'దేవదాస్' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండగా, వామిఖ గబ్బి 'చంద్ర' అనే గ్రే షేడ్ ఉన్న పాత్రలో మెరుస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఇదొక రివెంజ్ డ్రామా అని స్పష్టమవుతోంది. ముఖ్యంగా "మంచి అంటే చెడు.. చెడు అంటే మంచి" అనే కాన్సెప్ట్‌తో సినిమా సాగనుందని తెలుస్తోంది.

యాక్షన్ సన్నివేశాలు అత్యంత సహజంగా, రక్తం చిందేలా ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ నటన, బాడీ లాంగ్వేజ్ ఒక ప్రొఫెషనల్ నటుడిలా ఉండటం విశేషం. వామిఖ గబ్బి నటన కూడా చాలా ఇంటెన్స్‌గా ఉంది. ఇక అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM) ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆయన స్వరపరిచిన 'రాగ ఆఫ్ రివెంజ్' సాంగ్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అరుణ్ మాతేశ్వరన్ తనదైన శైలిలో రా అండ్ రస్టిక్ విజువల్స్‌తో ఆకట్టుకున్నారు. ట్రైలర్‌లో డైలాగులు తక్కువగా ఉన్నప్పటికీ, విజువల్స్ ద్వారా కథలోని గాఢతను చెప్పే ప్రయత్నం చేశారు. లోకేష్ కనగరాజ్ అభిమానులు ఆయనను నటుడిగా చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి 'DC' ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మెప్పిస్తాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com