Home

»

Latest News

'లైగ‌ర్‌'కు బ‌ట్ట క‌ప్పిన బాల‌య్య‌! మీమ్స్ మామూలుగా లేవుగా!!

Jul 2, 2022 6:41PM

 

పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న 'లైగ‌ర్' మూవీకి సంబంధించి శ‌నివారం ఉద‌యం రిలీజ్ చేసిన పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఆ పోస్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ఒంటిపై నూలుపోగు లేకుండా న్యూడ్‌గా క‌నిపిస్తుండ‌ట‌మే దీనికి కార‌ణం. త‌న ప్రైవేట్ పార్ట్ ద‌గ్గ‌ర ఓ రోజ్ ఫ్ల‌వ‌ర్ బొకేను పెట్టుకొని క‌నిపిస్తున్నాడు విజ‌య్. చాలామంది విజ‌య్ డేరింగ్ అండ్ సెక్సీయెస్ట్ లుక్స్‌ను మెచ్చుకుంటున్నారు. ఈ మూవీలో అత‌ను మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. అత‌ని జోడీగా అన‌న్యా పాండే న‌టిస్తోంది. ఆగ‌స్ట్ 25న పాన్ ఇండియా మూవీగా ఇది రిలీజ్ అవుతోంది.

లేటెస్ట్ లైగ‌ర్ పోస్ట‌ర్‌కు వ‌చ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఇండియా వ్యాప్తంగా అత‌ను సెన్సేష‌నల్ స్టార్ అయ్యేట్లు క‌నిపిస్తోంది. #SexiestPosterEver అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్ట‌ర్‌లో ట్రెండింగ్‌లోకి వ‌చ్చింది కూడా. విజ‌య్ హాట్ అవ‌తారాన్ని ఫ్యాన్స్ విప‌రీతంగా షేర్ చేస్తున్నారు. గ్రీకువీరుడిలా క‌నిపిస్తోన్న విజ‌య్ రూపాన్ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు.

మ‌రోవైపు 'లైగ‌ర్' పోస్ట‌ర్‌పై ట్రోలింగ్ మీమ్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. ఒక మీమ్‌లో విజ‌య్ బాడీని బాల‌కృష్ణ క్లాత్‌తో నిండుగా క‌ప్పుతుండ‌టం గ‌మ‌నార్హం. దానికి "క‌నీసం డైప‌ర్ అయినా వేసుకోరా లైగ‌ర్ గా" అనే కామెంట్ పెట్టారు. ఈ మీమ్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఇంకో మీమ్‌లో "నేను చూసిందీ చూస్తోందీ అంతా నిజ‌మేనా" అనే కామెంట్ పెట్టారు. మ‌రో మీమ్‌లో విజ‌య్ న్యూడ్ బాడీకి టీష‌ర్ట్‌, షార్ట్ తొడిగారు. మ‌రొక‌రు పీకేలో ఆమిర్ ఖాన్‌, కాలీఫ్ల‌వ‌ర్‌లో సంపూర్ణేశ్‌బాబు న్యూడ్ ఫొటోల‌ను జ‌త‌చేసి, "ఒక రేడియో (ఆమిర్ ఖాన్‌), ఒక కాలీఫ్ల‌వ‌ర్ (సంపూర్ణేశ్ బాబు), ఒక రోజ్ ఫ్ల‌వ‌ర్ (విజ‌య్‌)" అంటూ మీమ్‌ను క్రియేట్ చేశారు. "ఛీ దరిద్రం ... ఉదయాన్నే ... ఈడి దరిద్రం చూడాల్సి వచ్చింది." అని వేరొక నెటిజ‌న్ కామెంట్ పెట్టాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com