Home

»

Latest News

Lenin: అదే అతి పెద్ద ప్లస్ పాయింట్.. లెనిన్ కి తిరుగులేదు

May 02, 2026

కింగ్ నాగార్జున(Nagarjuna)ఏ ముహూర్తాన లెనిన్(Lenin)జూన్  26 రిలీజ్ డేట్ వాయిదాపడదని అన్నాడో కానీ ఆ విషయం నిజమైనందుకు అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎందుకంటే పెద్ది జూన్ 25  నుంచి జూన్ 4 కి షిఫ్ట్ అయ్యింది. దీంతో సినీ ట్రేడ్ సర్కిల్స్ లో లెనిన్ సింగిల్ గా వస్తుండంపై స్పందిస్తున్నారు. మరి ఆ లెనిన్ విశేషాలేంటో చూద్దాం.


సోలో రిలీజ్ కావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో లెనిన్  ప్రదర్శితమయ్యే అవకాశం ఉంది. పోటీ ఉండదు కాబట్టి  టాక్ కొంచెం పాజిటివ్‌గా వచ్చినా వసూళ్లు భారీగా రావడం ఖాయం. దీంతో సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కి లెనిన్ సోలో రిలీజ్ మంచి అవకాశం. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కావడం, అఖిల్ మాస్ లుక్ లో కనపడటంతో పాటు ఫ్యాన్స్, ప్రేక్షకులకి విపరీతంగా కనెక్ట్ అయ్యే కధాంశాలు పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో లెనిన్ రికార్డులు సాధించే అవకాశం ఉందని అంటున్నారు.


Also read: Rashmi Gautam: ఆ పార్టీకి నా బహిరంగ మద్దతు.. వెల్లడి చేసిన రష్మీ

ఏజెంట్ పరాజయం తర్వాత అఖిల్  చాలా గ్యాప్ తీసుకుని వస్తున్న 'లెనిన్' లో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri borse)హీరోయిన్ కాగా మురళి కిషోర్(Murali Kishor)అబ్బూరి దర్శకుడు. అగ్ర నిర్మాణ సంస్థలు  సితార ఎంటర్ టైన్ మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com