
అఖిల్ అక్కినేని((Akhil Akkineni)అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. 2023లో విడుదలైన 'ఏజెంట్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈసారి ఎలాగైనా భారీ బ్లాక్‌బస్టర్ కొట్టాలనే కసితో అఖిల్ జూలై 10 న తన లెనిన్' తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యువ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సగటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ప్రమోషన్స్ విషయంలో ఇప్పటివరకు కాస్త సైలెంట్‌గా ఉన్న చిత్ర బృందం ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచింది.
రేపు అంటే 30 న థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేయాలని మేకర్స్ అధికారికంగా నిర్ణయించారు. వైజాగ్ వేదికగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని అత్యంత ఘనంగా నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. అఖిల్‌ని మునుపెన్నడూ చూడని పూర్తిస్థాయి ఊర మాస్, రగ్గడ్ అవతార్‌లో దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు చూపించబోతున్నట్లు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, 'సోల్ ఆఫ్ లెనిన్' గ్లింప్స్ వీడియో ద్వారా స్పష్టమైంది. అఖిల్ తన రోల్ కోసం ప్రత్యేకమైన డైట్, కఠినమైన వర్కౌట్స్ చేసి తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పక్కా విలేజ్ కుర్రాడి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీని నేర్చుకోవడం విశేషం. రాయలసీమ గ్రామీణ నేపథ్యంగా సాగే ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో ఒక వైవిధ్యమైన పాత్రలో అఖిల్ తన నటనా విశ్వరూపం చూపించనున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. 'ప్రేమ' అనే సున్నితమైన అంశం చుట్టూ ఈ కథ అల్లుకున్నప్పటికీ, యాక్షన్ మోతాదు ఎక్కడా తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. అఖిల్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. భాగ్యశ్రీతో అఖిల్ అద్భుతమైన లవ్ స్టోరీ, ఆ ప్రేమ కోసం అతను అందర్నీ ఎదిరించి నిలబడే తీరు, చేసే పోరాటం హైలైట్‌గా నిలవనుందని సమాచారం.
Also read: Chiranjeevi: ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి, రేవంత్ రెడ్డి.. ఫ్యాన్స్ సంబరాలు
శివాజీ, బ్రహ్మాజీ, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను వంటి విలక్షణ తారలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తూ కథకు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందిస్తున్న అద్భుతమైన సంగీతం. మాస్ సినిమాలకు ప్రాణం పోసే థమన్, ఇప్పటికే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల ద్వారా సినిమాకు సూపర్ డూపర్ చార్ట్ బస్టర్ బజ్‌ను తీసుకొచ్చారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
.webp)





