Home

»

Latest News

lenin: లెనిన్ థియేటర్ల వేట.. బాక్సాఫీస్ వద్ద ఊరమాస్ జాతర!

Jul 7, 2026 12:47PM

 


ప్రస్తుత సినీ వాతావరణం చూస్తుంటే 'లెనిన్'(Lenin)తో అఖిల్ అక్కినేని ఈ సారి చాలా బలమైన హిట్ అందుకునేలా ఉన్నాడు.  ప్రచార చిత్రాలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అఖిల్ ,నాగార్జున,భాగ్యశ్రీ బోర్సే తో పాటు మిగతా నటీనటుల స్పీచ్ కూడా అందుకు తగ్గ బలమైన సంకేతాలు ఇస్తున్నాయి. పైగా మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో లెనిన్ ముస్తాబవడం అతి పెద్ద పాజిటివ్ వైబ్రేషన్.

లెనిన్ థియేట్రికల్ రిలీజ్ గురించి ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. నైజాం(తెలంగాణ), ఆంధ్రా, రాయలసీమ (సీడెడ్) ఏరియాల్లో లెనిన్ కి  రికార్డు స్థాయిలో థియేటర్లని  కేటాయిస్తున్నట్లు సమాచారం. అన్ని ఏరియాస్ కలుపుకొని దాదాపు 600 నుండి 750 కి పైగా స్క్రీన్లలో లెనిన్  విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్ కావడంతో సీడెడ్ రీజియన్‌లోనే  120కి పైగా ప్రముఖ థియేటర్లను లాక్ చేసినట్లు టాక్. ఇక ఓవర్సీస్ తో పాటు ఇండియాలోని మిగతా ఏరియాలు కలిపి మరో 200 స్క్రీన్లలో లెనిన్  ప్రదర్శితం కానుంది. దీంతో  మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 950 నుండి 1000 వరకు భారీ స్క్రీన్ కౌంట్‌తో ఈ మాస్ జాతర థియేటర్లలో మొదలు కానున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Also read: Jailer 2: మలయాళంలో జైలర్ 2 సంచలన రికార్డు.. రజినీ స్టామినాకి ఇదే నిదర్శనం!

మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ నిర్మించగా  థమన్ మ్యూజిక్. రిలీజ్ డేట్ 10 కోసమైతే ఫ్యాన్స్ ఫుల్ వెయిటింగ్ .

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com