Home

»

Latest News

అయ్యగారి అడ్డాలో లెనిన్ సెలబ్రేషన్స్.. స్పెషల్ ఆ అయ్యగారే!

Jul 15, 2026 6:32PM

 

అఖిల్ అక్కినేని ‘లెనిన్' తో  బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. త్వరలోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరబోతుండటంతో అక్కినేని అభిమానుల్లో సరికొత్త జోష్ వచ్చినట్లయింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మించిన లెనిన్ టాలీవుడ్‌ కి కూడా సరికొత్త జోష్ తీసుకొచ్చిందని చెప్పవచ్చు.

ఈ సంచలన విజయాన్ని మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడానికి చిత్ర బృందం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతమైన గుంటూరులో ఈ రోజు  బ్లాక్‌బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది. ఈ వేడుకలో  అఖిల్, భాగ్యశ్రీ బోర్సే, నాగార్జునతో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొననుంది. గుంటూరు నగరం అక్కినేని నాగేశ్వరరావు దగ్గరనుంచి   అక్కినేని కుటుంబానికి భారీ ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న నగరం. నాగార్జునకి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ఫ్యాన్ బేస్ గుంటూరులో కూడా ఉంది. మూవీ ప్లాప్ అయితే కన్నీళ్లు పెట్టుకునే అభిమానులు ఉన్నారంటే అక్కినేని ఫ్యామిలీకి గుంటూరులో ఉన్న అభిమాన గణాన్ని అర్ధం చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా అఖిల్ కి అయ్యగారు అనే టాగ్ లైన్ ఇచ్చిన వీరాభిమాని కూడా గుంటూరు వాస్తవ్యుడే. ఈ నేపథ్యంలో లెనిన్ సెలబ్రేషన్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Also read: యంగ్ హీరో ఖాతాలో 9 కోట్ల రూపాయలు.. వైరల్ అవుతున్న న్యూస్ 

akhil, lenin, bhagyashri borse, nagarjuna, guntur

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com