Home

»

Latest News

అఖిల్ అక్కినేని ఊచకోత.. రూ.100 కోట్ల క్లబ్‌లో 'లెనిన్'.!

Jul 30, 2026 12:51PM

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన తాజా యాక్షన్ డ్రామా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా అఖిల్ మాస్ మేకోవర్, ట్విస్ట్ లు, ఎమోషన్స్ కి అక్కినేని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా అఖిల్ ను ఒక పవర్ ఫుల్, ఎమోషనల్ అండ్ యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రలో దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు చూపించిన తీరు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందించింది.

ఇప్పుడు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును అధిగమించి అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ సందర్భంగా చిత్ర బృందం "మనోడు బ్లాక్‌బస్టర్ కొట్టేసాడు" అంటూ ఒక పవర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం అక్కినేని అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ మైలురాయిని దాటిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద తన విజయ పరంపరను ఇప్పటికీ కొనసాగిస్తోంది. మాస్ యాక్షన్ మూవీ లవర్స్ కు పర్ఫెక్ట్ ట్రీట్ లా మారిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో కూడా మరింత మెరుగైన కలెక్షన్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

 

 

Akhil Akkineni, Lenin Movie, 100 Crore Gross

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com