
రాయల్ స్టార్ గా అభిమానులు పిలిచుకుంటున్న అఖిల్(Akhil)అక్కినేని ఈ నెల 10 న లెనిన్ తో థియేటర్స్ లో అడుగుపెట్టి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాడు. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , కింగ్ నాగార్జున సంయుక్తంగా నిర్మించిన లెనిన్ మరి పది రోజులకి ఎంత మేర కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.
లెనిన్ పది రోజులకి 88 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు మేకర్స్ రీసెంట్ అధికారంగా తెలుపుతూ పోస్టర్ ని రిలీజ్ చేసారు. తొలిరోజే 16.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన లెనిన్ రెండు రోజుల్లో 37.2 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరిచింది. ఇక మొదటి వారాంతం ముగిసేసరికి, అంటే కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 61.1 కోట్ల మాసివ్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలైన పవర్ ఏంటో చూపించింది. ముఖ్యంగా రెండో ఆదివారం నాడు అంటే నిన్న సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలని మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. 10వ రోజున 3.22 కోట్ల నెట్ కలెక్షన్స్ రాగా, ఇది 9వ రోజు కలెక్షన్ల కంటే ఏకంగా 34.2 శాతం భారీ జంప్ కావడం విశేషం. ఇందులో మధ్యాహ్నం షోలకు అత్యధికంగా 46.77 శాతం, ఈవినింగ్ షోలకు 43.46 శాతం ప్రేక్షకులు హాజరయ్యారు.
also read: శ్రీనివాస మంగాపురం నుంచి మూడో సాంగ్ రిలీజ్.. ఈ సారి స్పెషల్ ఇదే
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నేపధ్యంలో, ‘భారతం మిట్ట’ అనే ఒక కల్పిత గ్రామంలో జరిగే ద్రౌపది ఉత్సవాల బ్యాక్‌డ్రాప్‌తో లెనిన్ తెరకెక్కింది.మహా భారత ఘట్టాల స్ఫూర్తి, పగ, ప్రతీకారం, మోసాలు ఆడియెన్స్ ని మెప్పిస్తున్నాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన ఫ్రీ స్పిరిటెడ్ నటనతో ఆకట్టుకోగా, శివాజీ, సునీల్, బ్రహ్మాజీ వంటి నటులు కథకి మరింత బలాన్ని చేకూర్చారు. లాంగ్ రన్‌లో ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే మొట్టమొదటి 100 కోట్ల క్లబ్ చిత్రంగా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
lenin, akhil, bhagyashri borse, murali kishor abburu, nagarjuna, naga vamsi
.webp)






