Home

»

Latest News

KTR షాకింగ్ ట్వీట్: ‘పారడైజ్’ కోసం రంగంలోకి మాజీ మంత్రి.!

Sep 26, 2026 2:32PM

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'ది ప్యారడైజ్'. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ మూవీ.. నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ, భారీ వసూళ్లతో సత్తా చాటుతోంది. కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టింది. 

అయితే 'ది ప్యారడైజ్' మూవీలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను పోలి ఉన్న ఎమ్మెల్యే శంకర్ పాత్ర వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి పోషించిన ఈ పాత్ర గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ ‘పారడైజ్’ సినిమా చూడటానికి రెడీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. 

‘పారడైజ్’ సినిమా చూడబోతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. “చాలా ఏళ్ల తర్వాత, ఈ రోజు రాత్రి నా ఫేవరెట్ యాక్టర్లలో ఒకరైన నాని, యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది పారడైజ్’ సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్తున్నాను” అని కేటీఆర్ రాసుకొచ్చారు.

కేటీఆర్ చేసిన ఈ వైరల్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 'పారడైజ్'లో కేసీఆర్ ను పోలిన పాత్ర ఉండటం, ఆ సినిమా చూడటానికి కేటీఆర్ వెళ్తుండటంతో.. సినిమా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది. 

ఇది కూడా చదవండి: ఇంగ్లీష్‌ లిరిక్స్‏తో 'జైలర్ 2' పాట.. ఆ రెండు లైన్స్ మాత్రమే తెలుగు.!

 

 

 

[KTR Tweet On Paradise Movie, The Paradise Movie, Nani Paradise, KTR Paradise, Paradise Movie KCR, KTR Twitter, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com