Home

»

Latest News

Something in the Rain: 35 ఏళ్ళ మహిళ.. ఆఫీస్ లో బాస్ తో.. బయట ఫ్రెండ్ తమ్ముడితో.!

Mar 12, 2026

  • సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా కొరియన్ రొమాంటిక్ డ్రామా
  • ఫ్రెండ్ తమ్ముడితో 35 ఏళ్ళ మహిళ లవ్ స్టోరీ

కొరియన్ సిరీస్ లకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంటుంది. పలు సిరీస్ లు రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కొరియన్ రొమాంటిక్ డ్రామాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఓ రొమాంటిక్ డ్రామా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

2018 లో వచ్చిన కొరియన్ సిరీస్ 'సంథింగ్ ఇన్ ది రెయిన్'(Something in the Rain). సన్ యే-జిన్, జంగ్ హే-ఇన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ కి.. అహ్న్ పాన్-సియోక్ దర్శకత్వం వహించారు. 35 ఏళ్ల వయసున్న ఓ మహిళ, తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన స్నేహితురాలి తమ్ముడితో ప్రేమలో పడితే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అనే కోణంలో ఈ సిరీస్ నడుస్తుంది. ఓటీటీ వేదికలు నెట్ ఫ్లిక్స్, ఎంఎక్స్ ప్లేయర్ లలో ఇది స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

కథ ఏంటంటే..
జిన్-ఆహ్ అనే మహిళ ఓ కాఫీ హౌస్ లో పనిచేస్తుంటుంది. అక్కడ మహిళలను చిన్నచూపు చూస్తుంటారు. మహిళా ఉద్యోగులకు బాస్ నుంచి లైంగిక వేధింపులు కూడా ఎదురవుతుంటాయి. 30 ఏళ్ళు దాటినా పెళ్లి కాకుండా, ఆఫీస్ లో బాస్ వేధింపులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న జిన్-ఆహ్ జీవితంలోకి.. జూన్-హుయి అనే యువకుడు వస్తాడు. అతను ఎవరో కాదు.. ఆమె ఫ్రెండ్ తమ్ముడే. 

వీడియో గేమ్ డెవలపర్ గా పని చేసే అతను.. విదేశాల నుంచి తిరిగి వస్తాడు. మొదట్లో అతన్ని ఓ తమ్ముడు లాగానే చూస్తుంది. క్రమంగా ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది. ముఖ్యంగా ఓ రోజు వర్షంలో గొడుగు కింద నడుస్తున్నప్పుడు ఇద్దరూ బాగా దగ్గరవుతారు. అప్పటినుంచి ముద్దు ముచ్చట్లతో సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపిస్తుంటారు. అయితే ఈ విషయం ఇంట్లో తెలుస్తుంది. వయస్సు తేడా వల్ల వారి ప్రేమ కథకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? అలాగే ఆఫీస్ లో వేధిస్తున్న బాస్ కి 'జిన్-ఆహ్' బుద్ధి చెప్పిందా? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

మంచి లవ్ స్టోరీతో పాటు మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపిన ఈ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఐఎండీబీలో ఈ సిరీస్ కి 8 రేటింగ్ ఉంది.

Also Read: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'పెన్నుమ్ పోరాట్టమ్'

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com