Home

»

Latest News

'కొరియన్ కనకరాజు' ప్రీ-రిలీజ్ బిజినెస్.. నిర్మాతల పరిస్థితి ఏంటి.?

Aug 4, 2026 1:19PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కించిన హారర్ కామెడీ ఫిల్మ్ 'కొరియన్ కనకరాజు'. రాయలసీమకు చెందిన కనకరాజు అనే సాధారణ యువకుడి శరీరంలోకి కొరియా దేశం నుంచి వచ్చిన ఒక ఆత్మ ప్రవేశించడంతో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఆగస్టు 7న థియేటర్లలో అడుగు పెట్టనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకోవడంతో బిజినెస్ భారీగానే జరిగింది.

ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలను పరిశీలిస్తే, బాక్సాఫీస్ బరిలోకి దిగకముందే నిర్మాతలు సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు రూ. 38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 26 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. సినిమా బడ్జెట్ లో చాలావరకు నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారానే రికవరీ కావడం మేకర్స్‌కు లభించిన అతిపెద్ద విజయం అని చెప్పవచ్చు.

ఇక వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే, రూ.15 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ సాధించి, హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. రూ.16 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం నెలకొన్న బజ్ కి, పాజిటివ్ టాక్ తోడైతే.. ఈ టార్గెట్ రీచ్ అవ్వడం అనేది చిన్న విషయమే అని చెప్పొచ్చు. 

మరి ఈ 'కొరియన్ కనకరాజు' ఆగస్టు 7న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో, ఎంతటి సంచలనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.

 

 

Korean Kanakaraju, Business, Varun Tej, Merlapaka Gandhi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com