Home

»

Latest News

బాక్సాఫీస్ సునామీ: 'కొరియన్ కనకరాజు' తొలిరోజే రికార్డు స్థాయి వసూళ్లు 

Aug 8, 2026 10:58AM

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిన్న వరల్డ్ వైడ్ గా 'కొరియన్ కనకరాజు' గా ల్యాండ్ అయ్యాడు.ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల హడావిడి థియేటర్స్ దగ్గర బాగానే కనపడుతుంది. మరి ఈ చిత్రం మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ వివరాలు చూద్దాం.


 చిత్రబృందం అందించిన అధికారిక సమాచారం ప్రకారం, 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 18 కోట్ల గ్రాస్ వసూలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఇండియాలో  4.50 కోట్లు కాగా ఏపి, తెలంగాణ నుంచే అత్యధికంగా  4 కోట్ల గ్రాస్ వసూలైంది. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే, కర్ణాటకలో రూ. 43 లక్షలు, తమిళనాడులో 5 లక్షలు, ఇతర ప్రాంతాలలో మరో 2 లక్షలు సాధించింది. ; ఓవర్సీస్ విషయానికి వస్తే  తొలిరోజే 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుణ్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ అని చెప్పవచ్చు. 

ఆక్యుపెన్సీ విషయానికి వస్తే  శుక్రవారం నాడు 41% ఆక్యుపెన్సీ నమోదవ్వగా, షో, షో కి గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. ఉదయం షోలకి  27.83% నమోదు కాగా, మధ్యాహ్నం 38.25%, సాయంత్రం 38.33% ,నైట్ షోలకి  అత్యధికంగా 57.42% ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. వీకెండ్ కావడంతో వసూళ్ల పరంగా మరిన్ని రికార్డులని తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.  అనంతపురం జిల్లా పెనుగొండలో ఉండే కనకరాజుకి కొరియా దేశంలో చనిపోయిన గ్యాంగ్ స్టార్ ఆత్మకి మధ్య ఉండే సంబంధం ఏంటనేదే కొరియన్ కనకరాజు కథ.  రితిక నాయక్ హీరోయిన్ గా కనిపించగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ,యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకుడు.

Korean Kanakaraju, varun Tej, Rithika Nayak

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com