Home

»

Latest News

'కొరియన్ కనకరాజు' బుకింగ్స్.. లెక్కలు వరుణ్‌ తేజ్‌కి అనుకూలంగానే ఉన్నాయా.?

Aug 6, 2026 10:47AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హర్రర్ కామెడీ ఫిల్మ్ 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్లకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆగస్టు 7 విడుదల తేదీ కాగా, నేడు(ఆగస్టు 6) ప్రీమియర్స్ వేస్తున్నారు. 

'కొరియన్ కనకరాజు' మూవీ ప్రీమియర్ బుకింగ్స్‌ పరంగా వరుణ్ తేజ్ కెరీర్ లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. కేవలం గత 24 గంటల్లోనే బుక్‌మైషోలో దాదాపు 10,000 టిక్కెట్లు అమ్ముడై.. ఫాస్ట్ ఫిల్లింగ్ అండ్ సోల్డౌట్ షోలు దర్శనమిస్తున్నాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ అన్ని ప్రధాన సెంటర్లలో కొత్త షోలను యాడ్ చేస్తున్నారు.

కేవలం గడిచిన 24 గంటల్లోనే దాదాపు 10,000 టిక్కెట్లు ఒక్క బుక్‌మైషోలోనే అమ్ముడైపోయాయి అంటే ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఓవర్సీస్ లో కూడా బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

రాయలసీమ మాస్ కుర్రాడికి కొరియా దెయ్యానికి కనెక్షన్ ఏంటి అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ హర్రర్ కామెడీ సినిమా కోసం ఆడియన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ఈ బుకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి.

యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా.. ఫ్లాప్స్ లో ఉన్న వరుణ్ తేజ్ కి కమ్ బ్యాక్ అవుతుందేమో చూడాలి. 

 

Korean Kanakaraju, Bookings, Varun Tej, Merlapaka Gandhi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com