Home

»

Latest News

ఇంద్రపుత్ర: కిరణ్ అబ్బవరం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్.!

Aug 10, 2026 12:57PM

'క', 'కె- ర్యాంప్', 'చెన్నై లవ్‌స్టోరీ' వంటి హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. ఆయన కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ కు.. 'ఇంద్రపుత్ర' (INDRAPUTRA) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. 

ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే మహా పోరాటంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ పుప్పాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఓ సరికొత్త సినిమాటిక్ యూనివర్స్‌కు పునాది వేస్తున్న ఈ ఎపిక్ విజువల్ వండర్ 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం లైనప్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. తన 13వ సినిమా కోసం కిరణ్ స్వయంగా మెగా ఫోన్ పట్టాడు. ఇది రూరల్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. 14వ సినిమాని సుకుమార్ రైటింగ్స్ లో చేయనున్నాడు. డెబ్యూ డైరెక్టర్ వీర కోగంటి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఇది రానుంది. ఇక ఇప్పుడు 15వ సినిమాగా 'ఇంద్రపుత్ర' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. 

 

 

Kiran Abbavaram, INDRAPUTRA, Srikanth Puppala, KA15

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com