Home

»

Latest News

'కింగ్ ఆఫ్ కొత్త'.. ఏ ఓటీటీలో స్ట్రీమ్ కానుందంటే..!

Aug 24, 2023 11:40AM

మాలీవుడ్ సెన్సేషన్ దుల్కర్ సల్మాన్ నటించిన తాజా చిత్రం 'కింగ్ ఆఫ్ కొత్త'. అభిలాష్ జోషి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఐశ్వర్య లక్ష్మి, ప్రసన్న, షబీర్ కల్లారక్కల్, అనిఖా సురేంద్రన్, నైలా ఉష, శరణ్ శక్తి, షమ్మి తిలకన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా.. ధ్రువ్ విక్రమ్ అతిథి పాత్రలోనూ, రితికా సింగ్ స్పెషల్ సాంగ్ లోనూ దర్శనమిచ్చారు. నేడు  (ఆగస్టు 24) ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ లోనూ థియేటర్స్ లోకి వచ్చింది.

ఇదిలా ఉంటే, ప్రముఖ ఓటీటీ సంస్థ 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'  ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ విషయం.. 'కింగ్ ఆఫ్ కొత్త' టైటిల్స్ లో ఓటీటీ పార్టనర్ ని పేర్కొనడంతో స్పష్టమైంది. బహుశా వచ్చే నెలలో లేదా అక్టోబర్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'కింగ్ ఆఫ్ కొత్త' స్ట్రీమ్ అయ్యే అవకాశముందంటున్నారు.  
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com