Home

»

Latest News

మెగా అభిమానులకు దివాళి గిఫ్ట్..

Oct 28, 2016 12:56PM

ఫెస్టివల్ సీజన్ కావడంతో వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు సినిమా వాళ్లు...అలాగే కొన్ని సినిమాలకు సెట్స్ మీదకు వెళ్తుండగా..అల్రెడి సెట్స్ మీదున్న సినిమాలు ఫస్ట్‌లుక్స్, టీజర్, ట్రైలర్‌లతో అభిమానులకు దివాళి గిఫ్ట్‌లను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులకు గిఫ్ట్ రెడీ అయ్యింది. సుమారు తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెండితెరకు రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నటించిన ఖైదీ నెం.150 షూటింగ్ చివరిదశకు చేరుకుంది. దీపావళిని పురస్కరించుకుని మెగాస్టార్ లుక్‌ని రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ ప్రకటించింది. అక్టోబర్ 29 మధ్యాహ్నం 2గంటలకు చిరంజీవి లుక్‌ని రివీల్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com