Home

»

Latest News

ఖైదీ నెం.150తో శాతకర్ణి రాణి...!

Sep 23, 2016 3:30PM

ప్రస్తుతం ఇండస్ట్రీ కళ్లు మొత్తం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఖైదీ నెం. 150 పైనే. లాంగ్ గ్యాప్ తర్వాత చిరు నటిస్తున్న సినిమా కావడమే అందుకు కారణం. ఈ మూవీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా హాట్ టాపిక్కే. అయితే మూవీ టెక్నిషియన్స్‌గా ముందుగా అనుకున్న వారు కాకుండా వేరే ఎవరేవరో భర్తీ అవుతున్నారు. అప్పట్లో ఈ మూవీలో హీరోయిన్‌గా అనుష్క, నయనతార పేర్లు ముందు వినపడినా.. ఫైనల్‌గా కాజల్ కన్ఫర్మ్ అయ్యింది.

తాజాగా చిరు పక్కన స్పెషల్ సాంగ్‌లో ఫస్ట్ తమన్నా అన్నారు..ఆ తర్వాత రేసుగుర్రంలో యంగ్ ఎమ్మెల్యేగా గిలిగింతలు పెట్టిన కేథరిన్ అన్నారు..కాని లేటేస్ట్‌ ఇన్‌ఫర్మేషన్ ప్రకారం శ్రేయాని ఆ సాంగ్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. స్పెషల్ సాంగ్ కోసం వివి.వినాయక్ శ్రేయాని సంప్రదించగా..అందుకు ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ప్రస్తుతం బాలకృష్ణ వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో రాణిగా నటిస్తోన్న శ్రీయా ఆ చిత్ర షూటింగ్‌ కోసమని మధ్యప్రదేశ్‌లో ఉన్నారు. ఆ షెడ్యూల్ పూర్తి చేసుకున్న వెంటనే ఆమె ఖైదీ సెట్స్‌లోకి జాయిన్ కానుందని సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com