Home

»

Latest News

మెగాస్టార్ స్టామినా అంటే అదే..!

Dec 9, 2016 10:48AM

తొమ్మిదేళ్లయినా ఆయన వదిలిన నెంబర్ వన్ ప్లేస్ ఇంకా రీప్లేస్ కాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన ఛరిష్మా ఏంటో.. ఆయన కాలుకదిపితే రికార్డులు బద్ధలవ్వాల్సిందే..అదే చిరంజీవి అంటే.  మెగాస్టార్ రీఎంట్రి ఇస్తున్న ఖైదీ నెం.150 టీజర్‌ను నిన్న విడుదల చేసింది చిత్ర యూనిట్. కేవలం 3 గంటల 5 నిమిషాల్లో ఖైదీ నెంబర్ 150 టీజర్‌కి 10 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది టాలీవుడ్ సినిమాల్లోకెల్లా ఫాస్టెస్ట్ మిలియన్ రికార్డ్. ఇంతకు ముందు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ధృవకు 4.5 గంటల్లో మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరి కొడుక్కే అంతుంటే తండ్రికి ఇంకెంత ఉండాలి..ఖైదీ అడుగుపెట్టగానే యూట్యూబ్‌ రికార్డుల లెక్క కూడా చిన్నబోయింది. కేవలం ఆరు గంటల సమయంలోనే 50వేలకు పైగా లైక్స్ సాధించి ఖైదీ మరో రికార్డుగా చెప్పుకోవాలి. దీనిని బట్టి చిరు రాకకోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో..ఈ టీజర్ వ్యూస్‌తోనే చెప్పవచ్చు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com