Home

»

Latest News

చిరంజీవా.. మ‌జాకా!

Dec 8, 2016 7:11PM

అవును మ‌రి. ఒక‌టా రెండా... దాదాపు ప‌దేళ్ల త‌ర‌వాత చిరంజీవి చేస్తున్న సినిమా ఇది. ఇప్ప‌టి జ‌న‌రేషన్ స్పీడు అందుకోవ‌డం, అదీ అర‌వై ఏళ్ల వ‌య‌సులో అంటే మాట‌లు కాదు. వేగంలో ఈ త‌రానికి ఏమాత్రం త‌గ్గేది లేద‌ని చిరు చాటి చెప్పే ప్ర‌య‌త్నం క‌నిపించింది ఖైదీ నెం. 150 టీజ‌ర్‌లో. ''నాకేదైనా న‌చ్చితేనే చేస్తా.. న‌చ్చితేనే చూస్తా.. కాదని బ‌ల‌వంతం చేస్తే కోస్తా.. ఏ స్వీట్ వార్నింగ్‌''   అంటూ.. చిరు డైలాగ్ చెప్పిన విధానం, ఆ స్టైల్ మెగా అభిమానుల్ని మురిపించ‌డం ఖాయం.  40 సెక‌న్ల ఈ టీజ‌ర్లో చిరు త‌ప్ప ఇంకేం క‌నిపించ‌లేదు. ఉన్నా.. క‌ళ్ల‌న్నీ చిరు వైపే ఉంటాయి. అదీ మెగా మాయాజాలం అంటే. 

నిజానికి క‌త్తి ఓ సీరియ‌స్ స‌బ్జెక్ట్‌. అంతే సీరియ‌స్‌గా పీక కోస్తా అనే డైలాగులు చెప్పొచ్చు. కాక‌పోతే... సీరియ‌స్ నెస్‌లోనే కామెడీ మిక్స్ చేస్తూ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు చిరు. చిరు అంటేనే అది. యాక్ష‌న్ ప్రియుల‌కే కాదు.. ఫ్యామిలీ ఫ్యామిలీకి న‌చ్చేలా వినోదాలు అందించ‌డం చిరు ప్ర‌త్యేక‌త‌. ఖైదీ నెం.150 టీజ‌ర్‌లోనూ అదే క‌నిపించింది. చిరు డ్ర‌స్పింగ్‌.. యాక్ష‌న్ మూమెంట్స్‌లో చిరు లుక్స్ అభిమానుల్ని అల‌రించ‌డం ఖాయం.  సంక్రాంతికి విడుద‌ల కానున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. ధృవ ఆడుతున్న అన్ని థియేట‌ర్ల‌లోనూ ఈ టీజ‌ర్‌ని ప్ర‌దర్శించబోతున్నారు. సో.. మెగా ఫ్యాన్స్‌కి ఇది డ‌బుల్ బొనాంజా అన్నమాట‌.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com