Home

»

Latest News

చిరంజీవి ఫైట్స్ చేస్తాడా? డాన్సులు చేస్తాడా?.. దాసరి

Jan 8, 2017 10:01AM

 

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు 'ఖైదీ నెంబర్ 150' సినిమా మంచి సమాధానం అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాయ్ లాండ్ లో జరిగింది. ఈ ఫంక్షన్ కు దాసరిని స్వయంగా ఆహ్వానించారు చిరంజీవి. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన దాసరి.. చిరంజీవిపై ప్రశంసలు కురిపించారు. 'ఎక్కడ చిరంజీవి ఉంటే అక్కడ జనసముద్రం ఉంటుంది. ఎన్నాళ్లైంది.. ఇలాంటి జనసముద్రాన్ని చూసి' అని అన్నారు. ఒక 'ఖైదీ', 'పసివాడి ప్రాణం', 'ఘరానా మొగుడు' ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఎన్నో అద్భుతమైన ఫంక్షన్స్ జరిగాయని.. 8 ఏళ్ల తరువాత హీరో నటించడమనేది చిరంజీవి విషయంలోనే సాధ్యమైందని ఆయన చెప్పారు. 8 ఏళ్ల తరువాత ఫైట్స్ చేస్తాడా? డాన్సులు చేస్తాడా? నటించగలడా? అని సందేహాలు వ్యక్తం చేసిన వారికి సమాధానమే ఈ సినిమా అని ఆయన తెలిపారు. సంక్రాంతి పండగకు ముందు '11నే సంక్రాంతి వచ్చినట్టే లెక్క' అని ఆయన అన్నారు. ఈ సినిమా కధలో అన్ని అంశాలు ఉన్నాయని, 'ఠాగూర్'  రికార్డులు సవరించే మంచి సినిమా వస్తోందని ఆయన తెలిపారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com