Home

»

Latest News

ఖైదీ నెం.150 సెన్సార్ రివ్యూ

Jan 2, 2017 1:25PM

మెగా అభిమానులు వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్న చిత్రం ఖైదీ నెం.150.  తొమ్మి దేళ్ల త‌ర‌వాత చిరు రీ ఎంట్రీ ఇస్తున్న చిత్ర‌మిది. దానికి తోడు ఆయ‌న 150వ చిత్రం!  దాంతో అంచ‌నాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. క‌త్తి సినిమాకి రీమేక్ అని తెలిసినా, చిరు ఎలా క‌నిపిస్తాడు, ఏం చేయ‌బోతున్నాడు, స్టెప్పులు ఎలా ఉండ‌బోతున్నాయి?  అనే విష‌యంలో ఆస‌క్తి నెల‌కొంది. ఫ‌స్ట్ డే.. ఫ‌స్ట్ షో బొమ్మ  ప‌డేంత వ‌ర‌కూ చిరు అభిమానుల ఉత్కంఠ‌త ఏమాత్రం త‌గ్గ‌దు. ఇప్పుడు ఈసినిమాకి సెన్సార్ పూర్త‌య్యింది. సెన్సార్ బృందం యు బై ఏ స‌ర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. మ‌రి ఈసినిమా ఎలా ఉంది??  చిరు అభిమానుల ఆశ‌లు అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉందా??  విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్‌, లాబ్ రిపోర్ట్ ఎలా ఉంది??


* 147 నిమిషాల పాటు సాగే సినిమా ఇది. అంటే దాదాపు రెండున్న‌ర గంట‌ల‌న్న‌మాట‌. సినిమా విడుద‌ల‌కు ఇంకా టైమ్ ఉంది కాబ‌ట్టి.. ఈ సినిమాని ట్రిమ్ చేసే అవ‌కాశంఉంది. ఎంత ట్రిమ్ చేసినా 2 గంట‌ల 20 నిమిషాల ర‌న్ టైమ్ ఉండ‌డం ఖాయం.


* క‌త్తి రీమేక్ అయినా... చిరు బాడీ లాంగ్వేజ్‌కి త‌గ్గ‌ట్టుగా చాలా మార్పులు చేశార్ట‌. క‌త్తి సినిమా చూసిన‌వాళ్ల‌కు కూడా ఈ సినిమా కొత్త‌గా క‌నిపించాల‌ని వినాయ‌క్ ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌లు తీసుకొన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతుంది.

* ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు. ఓ పాత్ర సీరియ‌స్‌గా ఉంటే.. మ‌రోటి జోవియ‌ల్‌గా ఉంటుంది. రెండో పాత్ర ద్వారా కావ‌ల్సినంత వినోదం పండించ‌డానికి ట్రై చేశార‌ట‌. క‌థ ప్ర‌కారం సీరియ‌స్ చిరంజీవిదే అగ్ర‌తాంబూలం అయినా, ఎంట‌ర్టైన్‌మెంట్ విభాగాన్ని మాత్రం రెండో చిరంజీవి న‌డిపించాడ‌ట‌. ఒక విధంగా చెప్పాలంటే అటు ఠాగూర్‌నీ ఇటు.. రౌడీ అల్లుడు సినిమానీ మిక్స్ చేసిన‌ట్టు ఈ సినిమా ఉండ‌బోతోంద‌ట‌.

* చిరు ఎంట్రీ సీన్ అదిరిపోవ‌డం ఖాయమ‌ని తెలుస్తోంది. ఆ సీన్‌కి థియేట‌ర్లో పూన‌కాలు రావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.


* డాన్సుల్లో చిరు రెచ్చిపోయాడ‌ట‌. ఐటెమ్ గీతంలో చిరు వేసిన స్టెప్పులు మ‌రోసారి వీణ స్టెప్‌లాంటి సిగ్నేచ‌ర్ స్టెప్పుల్ని గుర్తు చేసేలా సాగింద‌ని టాక్‌,

* ప‌తాక స‌న్నివేశాల్లో డైలాగులు ఆక‌ట్టుకొనేలా సాగాయ‌ట‌. ఈసినిమాకి ఆత్మ అంతా అక్క‌డే ఉంద‌ని, ఆయా సన్నివేశాల‌కు త‌గిన డైలాగుల్ని సాయిమాధ‌వ్ బుర్రా అద్భుతంగా రాశార‌ని తెలుస్తోంది.


* అక్క‌డ‌క్క‌డ ప్ర‌భుత్వ విధానాల‌కు వ్య‌తిరేకంగా చుర‌క‌ల్లాంటి డైలాగులు వినిపించాయ‌ని చెబుతున్నారు.* టోట‌ల్‌గా ఈ సినిమా మాస్ ని అల‌రించ‌డం ఖాయ‌మ‌ని, ఇది చిరు ఫ్యాన్స్‌కి చిరు ఇస్తున్న గిఫ్ట్ అని ఈ సినిమా గురించి తెలిసిన‌వాళ్లు, ప‌ని చేసిన వాళ్లు చెబుతున్నారు. మొత్తానికి చిరు ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి రెచ్చిపోయి చిందులేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com