Home

»

Latest News

Monalisa: సిపిఎం అగ్ర నేతలకి మోనాలిసా పోక్సో సెగ 

May 20, 2026

 

 

మోనాలిసా, ఫర్మాన్ వివాహం విషయంలో  మోనాలిసా మైనర్ అంటూ జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) మరియు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) రంగంలోకి దిగడంతో కథ పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే.ఎన్‌సిఎస్‌టి జరిపిన విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి సమయంలో కేరళ పోలీసుల వెరిఫికేషన్‌లో మోనాలిసా సమర్పించిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి పత్రాల ప్రకారం ఆమె పుట్టిన తేదీ జనవరి 1, 2008 గా ఉంది, అంటే ఆమెకి  18 ఏళ్లు నిండి మేజర్ అని భావించారు. కానీ మధ్యప్రదేశ్ ఆసుపత్రి రికార్డులను పరిశీలించిన ఎన్‌సిఎస్‌టి, ఆమె అసలు పుట్టిన తేదీ డిసెంబర్ 30, 2006 అని తేల్చింది. దీని ప్రకారం మార్చి 2029 లో పెళ్లి జరిగే నాటికి మోనాలిసా వయసు కేవలం 16 సంవత్సరాల 2 నెలలు మాత్రమే. అంటే ఆమె చట్టబద్ధంగా మైనర్ అని రుజువైంది.

ఈ నివేదిక ఆధారంగా మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్ జిల్లా మహేశ్వర్ పోలీసులు మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్‌పై కఠినమైన పోక్సో (POCSO) చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం మరియు ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి మైనర్ బాలికను పెళ్లాడారనే ఆరోపణలతో ఈ కేసు తీవ్రరూపం దాల్చింది. అయితే మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ఈ ఆరోపణలని  తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే తన పుట్టిన తేదీ రికార్డులను ఫోర్జరీ చేశారని, తన భర్తను లవ్ జిహాద్ పేరుతో టార్గెట్ చేస్తున్నారని మోనాలిసా ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ వివాదంపై తాజాగా వారు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌ను ఆశ్రయించారు. తన అసలు జనన ధృవీకరణ పత్రాన్ని పునరుద్ధరించాలని, ఫోర్జరీ పత్రాలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. 

Also read: Twisha sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి ట్విషా శర్మ పోస్ట్‌మార్టంలో షాకింగ్ విషయాలు

ప్రస్తుతం కేరళ హైకోర్టు ఈ జంటకి అరెస్ట్ నుండి తాత్కాలిక రక్షణ కల్పించగా, మధ్యప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాల మధ్య ఈ అధికార పరిధి మరియు వయసు వివాద చట్టపరమైన పోరాటం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఆ ఇద్దరి వివాహాన్ని జరిపించిన  కేరళ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి, సిపిఎం  రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ పై కూడా కేసు నమోదయ్యింది     


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com