Home

»

Latest News

KD The Devil: 'కేడీ' ట్రైలర్ రివ్యూ.. ధృవ సర్జా ఊచకోత.. మరో 'కేజీఎఫ్' అవుతుందా?

May 14, 2026 12:41PM

కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో భారీ పాన్ ఇండియా విజువల్ వండర్ బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమైంది. 'యాక్షన్ ప్రిన్స్' ధృవ సర్జా (Dhruva Sarja) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రేమ్ రూపొందించిన చిత్రం 'కేడీ-ది డెవిల్' (KD - The Devil). రేపు (మే 15) తెలుగులో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రక్తం మరిగే యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ట్రైలర్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తోంది.

ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా 1970ల నాటి బెంగళూరు అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగుతుందని స్పష్టమవుతోంది. ఒక ప్రమాదకరమైన నేరస్థుడు జైలు నుంచి విడుదలవుతుంటే, అతడిని ఆపడానికి పోలీసులు, చంపడానికి శత్రువులు వేసే ప్లాన్లతో ట్రైలర్ ఎంతో ఉత్కంఠభరితంగా మొదలైంది. కేడీ పాత్రలో ధృవ సర్జా ఎంట్రీ సీన్ మాస్ ప్రేక్షకులకు ఐఫీస్ట్ అని చెప్పాలి. అతడి కళ్ళలో కనిపించే ఇంటెన్సిటీ, మేకోవర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఈ చిత్రంలో తారాగణం చాలా గ్రాండ్‌గా ఉంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తుండగా, శిల్పా శెట్టి సత్యవతి అనే బలమైన పాత్రలో మెరిశారు. వీరికి తోడు రమేశ్ అరవింద్, రవిచంద్రన్ వంటి సీనియర్ తారలు తోడవ్వడం సినిమాకు పెద్ద అసెట్. ముఖ్యంగా అర్జున్ జన్యా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది. విజువల్స్ చాలా రా అండ్ రస్టిక్ గా ఉండి, నాటి కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించాయి.

సినిమా సినిమాకు తన బాడీ లాంగ్వేజ్‌ను మారుస్తూ వస్తున్న ధృవ సర్జా, 'కేడీ' కోసం ప్రాణం పెట్టినట్లు కనిపిస్తోంది. ధృవ సర్జా యాక్షన్ సీక్వెన్స్‌లు, కత్తి పట్టుకుని ఆయన చేసే విధ్వంసం థియేటర్లలో విజిళ్లు వేయించడం ఖాయం.

మొత్తానికి 'కేడీ-ది డెవిల్' ట్రైలర్ తో దర్శకుడు ప్రేమ్ మరో 'కేజీఎఫ్' స్థాయి మ్యాజిక్ చేయబోతున్నారని అర్థమవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 2026లో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక విందు భోజనంలా ఉండబోతోంది.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com