Home

»

Latest News

Karuppu: వీరభద్రుడు ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్.. ప్రముఖ దర్శకుడి వీడియో వైరల్ 

May 19, 2026 10:49AM

 

ప్రస్తుతం థియేటర్స్ అన్ని కరుప్పు అలియాస్ వీరభద్రుడుతో మాస్ జాతరని తలపిస్తున్నాయి. కేవలం 3 రోజుల్లోనే 147 కోట్ల రూపాయలని రాబట్టిందంటే  వీరభద్రుడి సునామి స్థాయిని అర్ధం చేసుకోవచ్చు. ఇక అభిమానులకైతే ఈ విజయం పూనకాలు తెప్పిస్తోంది. ముఖ్యంగా థియేటర్లలో సూర్య ఎంట్రీ సమయంలో వచ్చే 'సాలిడ్ టైటిల్ కార్డ్' వీడియో ఫ్యాన్స్‌ని  విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ టైటిల్ కార్డ్ విజువల్స్ కి  సాయి అభ్యంకర్ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఫ్యాన్స్, ప్రేక్షకులని  డ్యాన్స్ చేసేలా చేస్తున్నాయి. సినిమా విడుదలైనప్పటి నుండి ఈ అఫీషియల్ టైటిల్ కార్డ్ వీడియోని  ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు దర్శకుడు ఆర్జే బాలాజీని కోరుతూ వస్తున్నారు. ఫ్యాన్స్ కోరికని గౌరవిస్తూ ఆర్జే బాలాజీ తాజాగా  వీడియో క్లిప్‌ని  తన ట్విట్టర్ తో పాటు   యూట్యూబ్ లో రిలీజ్ చేసాడు. ది వన్ సూర్య ఈజ్ హియర్.. దిస్ ఈజ్ ఫర్ యు ఆల్ ది అన్బానా ఫ్యాన్స్" అంటూ షేర్ చేసిన  వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also read: janhvi kapoor: క్రేజీ హీరో సరసన ఆఫర్ దక్కించుకున్న జాన్వీ కపూర్

 కోర్టు వ్యవస్థలోని అవినీతిపై పోరాడేందుకు ఒక శక్తివంతమైన దైవం మానవరూపంలోకి వస్తే ఎలా ఉంటుందనే వినూత్న కథాంశంతో వీరభద్రుడు తెరకెక్కింది. విలన్ గా  ఆర్జే బాలాజీ సూపర్ గా మెప్పించాడు.  

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com