కార్తి.. బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్!
on May 19, 2022
కోలీవుడ్ స్టార్ కార్తి.. చివరిసారిగా `సుల్తాన్`తో పలకరించాడు. 2021 ఏప్రిల్ 2న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ ముంగిట యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో.. రాబోయే సినిమాలపైనే ఆశలు పెట్టుకున్నాడు కార్తి. కాగా, ప్రస్తుతం కార్తి చేతిలో 5 ప్రాజెక్ట్స్ ఉండగా.. వాటిలో మూడు సినిమాలు ఈ క్యాలెండర్ ఇయర్ లోనే సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే.. `విరుమన్`, `పొన్నియన్ సెల్వన్ః పార్ట్ 1`, `సర్దార్`. వీటిలో `సర్దార్`కి ఇంకా రిలీజ్ డేట్ కన్ఫామ్ కాలేదు కానీ `పొన్నియన్ సెల్వన్` తొలి భాగానికి ఇప్పటికే విడుదల తేది లాక్ అయింది. `విరుమన్`కి కూడా తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాలు కూడా వరుస నెలల్లో కేవలం నెల రోజుల వ్యవధిలో ఎంటర్టైన్ చేయనున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. ముత్తయ్య దర్శకత్వంలో కార్తి హీరోగా నటించిన యాక్షన్ డ్రామా `విరుమన్` ఆగస్టు 31న తెరపైకి రానుండగా.. లెజండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఎపిక్ పిరియడ్ డ్రామా `పొన్నియన్ సెల్వన్ః 1` సెప్టెంబర్ 30న జనం ముందుకు వస్తోంది. మరి.. ఆగస్టు, సెప్టెంబర్ చివరి తేదీల్లో వినోదాలు పంచనున్న ఈ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో కార్తి ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని పొందుతాడో చూడాలి.