జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిస్థితి ఏంటి!
on Oct 14, 2025

రిషబ్ శెట్టి(Rishab shetty)తన వన్ మాన్ షో 'కాంతార చాప్టర్ 1'(Kantara chapter 1)ద్వారా పాన్ ఇండియా వ్యాప్తంగా కలెక్షన్ల సునామి ని సృష్టిస్తున్నాడు. బాహుబలి మొదటి భాగానికి వచ్చిన కలెక్షన్ లు సైతం కాంతార చాప్టర్ 1 దెబ్బకి చెల్లా చెదరయ్యాయి. దీనికంతటికి మూలకారణం 'రిషబ్ శెట్టి'(Rishab Shetty).తన అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ తో సిల్వర్ స్క్రీన్ వద్ద సరికొత్త సూపర్ స్టార్ గా అవతరించాడు. ప్రేక్షకులు కూడా ముక్త కంఠంతో ఇదే మాట చెప్తున్నారు. దీంతో రిషబ్ శెట్టి తదుపరి చిత్రాలపై అభిమానులు, ప్రేక్షకులతో పాటు ట్రేడ్ సర్కిల్స్ లో ఆసక్తి నెలకొని ఉంది.
రిషబ్ శెట్టి ప్రస్తుతం హిందువుల ఆరాధ్య దైవం, శ్రీరామదూత హనుమంతుడికి చెందిన సబ్జెక్ట్ నేపథ్యంలో 'జై హనుమాన్'(Jai Hanuman)అనే డెవోషనల్ చిత్రంతో పాటు,మరాఠా యోధుడు, హిందు ఐకాన్ గా పిలవబడే 'ఛత్రపతి శివాజీ మహారాజ్'(Chhatrapati Shivaji Maharaj)జీవిత కథ ఆధారంగా సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండిటిలోను టైటిల్ రోల్ లో కనిపిస్తున్నాడు.పైగా రెండు చిత్రాలు కూడా షూటింగ్ దశలో ఉన్నాయి. కాంతార చాప్టర్ 1 సృష్టించబడిన చిత్రం. కానీ జై హనుమాన్, ఛత్రపతి శివాజీ మహారాజ్ లు నిజ జీవితంలో హిందువుల మనోఫలకాల్లో మెదిలినవి. చాప్టర్ 1 లో ఒక రేంజ్ లో పెర్ ఫార్మ్ ప్రదర్శించిన రిషబ్, ఈ రెండు చిత్రాల్లో మరెంత పెర్ ఫార్మ్ ని ప్రదర్శిస్తాడో చెప్పక్కర్లేదు.
పైగా స్వతహాగా రిషబ్ శెట్టి కి కూడా దైవ చింతన ఎక్కువ. దీంతో సదరు రెండు చిత్రాల్లో తన నటన ఏ స్థాయిలో సాగుతుందో ఎంత ఊహించిన తక్కువే అవుతుంది.మేకర్స్ కూడా చాప్టర్ 1 భారీ స్థాయిలో విజయం సాధించడంతో, సదరు రెండు చిత్రాల నిర్మాణం, సబ్జెట్, క్వాలిటీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. జై హనుమాన్ నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ 2027 లో విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



