లోకనాయకుడు కమల్ హాసన్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. విలక్షణమైన కథలు, విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కలిసి ఓ కొత్త సినిమా చేస్తున్నారు. కమల్ హాసన్ నటిస్తున్న 237వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘సండియార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది.
అయితే ఈ టైటిల్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు కారణమవుతోంది. ఎందుకంటే సుమారు 22 ఏళ్ల క్రితం కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విరుమాండి’ సినిమాకు మొదట ‘సండియార్’ అనే పేరునే అనుకున్నారు. 2003లో ఈ టైటిల్‌ను ప్రకటించిన సమయంలో కొన్ని రాజకీయ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ పేరు కులపరమైన ఘర్షణలను ప్రోత్సహించేలా ఉందంటూ అభ్యంతరాలు రావడంతో వివాదం మొదలైంది. దీంతో చివరకు కమల్ హాసన్ ఆ టైటిల్‌ను మార్చి ‘విరుమాండి’గా ఖరారు చేశారు. 2004లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కమల్ హాసన్ మళ్లీ అదే టైటిల్‌ను తన కొత్త సినిమాకు పెట్టడం విశేషంగా మారింది. అప్పట్లో వివాదాల కారణంగా వదులుకున్న పేరునే ఇప్పుడు మరోసారి తన సినిమా కోసం ఎంచుకోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే ఈ కొత్త సినిమా ‘విరుమాండి’కి సీక్వెల్ కాదు. దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్‌తో కమల్ హాసన్ చేస్తున్న పూర్తిగా కొత్త ప్రాజెక్ట్ ఇది.
ఇక విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. ఇందులో కమల్ హాసన్ చాలా గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. కారు కిటికీలో నుంచి రివాల్వర్ పట్టుకుని శత్రువులపై దాడికి సిద్ధమైనట్టుగా ఆయన కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. కారు డోర్‌పై రక్తపు మరకలు, చేతిలో తుపాకీతో కమల్ కనిపిస్తున్న విధానం చూస్తుంటే సినిమా యాక్షన్, ప్రతీకార నేపథ్యంలో తెరకెక్కనుందనే ఆసక్తి కలుగుతోంది. అయితే చిత్ర కథకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం ఇంకా వెల్లడించలేదు.
ఇది కూడా చదవండి: మళ్లీ కెమెరా ముందుకు సీఎం విజయ్: డైరెక్టర్ ఎవరంటే.?
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. సునీల్ కె.ఎస్. సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీతలైన అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. సి.ఎస్. బాలచందర్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, అమృత రామ్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. ఎస్. డిస్నీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మరో విశేషం ఏమిటంటే.. కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7నే ఈ సినిమా షూటింగ్‌ను కూడా ప్రారంభించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఒకప్పుడు వివాదానికి కారణమైన ‘సండియార్’ పేరును ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన కమల్ హాసన్.. ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.
మీకు నచ్చవచ్చు: గ్లామర్ నుంచి నటవిశ్వరూపం వరకు.. అనుష్కకు స్టార్డమ్ తెచ్చిన టాప్ 10 సినిమాలివే.!
[Kamal Haasan, Kamal Haasan New Movie, Sandiyar Movie, Sandiyar First Look, Kamal Haasan Birthday, SU Arun Kumar, Anirudh Ravichander, Virumaandi Movie, Raaj Kamal Films International, Kamal Haasan 237th Film]






