Home

»

Latest News

'ప్యారడైజ్'తో పోటీ కాదు: సెప్టెంబర్ 25న 'కళ్యాణం కమనీయం జీవితం' రిలీజ్.!

Sep 18, 2026 2:27PM

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "కళ్యాణం కమనీయం జీవితం". ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయ్యింది . తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా "కళ్యాణం కమనీయం జీవితం" సినిమా టీమ్ సంస్థ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. 

నిర్మాత పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ.. "రీసెంట్ గా మా కళ్యాణం కమనీయం జీవితం సినిమాని మా ఫ్రెండ్స్ కి , శ్రేయోభిలాషులకు, కొంతమంది మీడియా మిత్రులకు చూపించడం జరిగింది. సినిమాని చూసిన తర్వాత సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు. మంచి వ్యక్తులతో ఈ సినిమా ప్రారంభమైంది. లెజెండరీ రైటర్ విజయేంద్రప్రసాద్ గారు సినిమా పోస్టర్ ను, చంద్రబోస్ గారు పాటను విడుదల చేశారు. వి.వి. వినాయక్ గారు కూడా మా ఈవెంట్ కు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఈ మూవీ మంచి ఫ్యామిలీ, యూత్ ఓరియంటెడ్ మూవీగా మా డైరెక్టర్ తీర్చిదిద్దారు. ఈ మూవీలో నటించిన నటి నటులు ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. శ్రీ మురళి కార్తికేయ మంచి సంగీతాన్ని అందించారు. ఈ నెల 25 న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాము. మూవీ చిన్నదైనా కంటెంట్ చాలా పెద్దది. డైరెక్టర్ రవి లోకిరెడ్డి, రైటర్ అరవింద్ ఏకలవ్య మంచిగా సినిమాని తీర్చిదిద్దారు. ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది." అన్నారు 

డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. "టైటిల్ విని మా నిర్మాతలు ఈ సినిమాని ఒకే చేశారు. ఇందులో సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మేమందరం చాలా కష్టపడి ఈ సినిమాని తీర్చిదిద్దాము. మంచి పాటలు ఉంటాయి, మంచి కథ వుంటుంది, మంచి ఎమోషన్ వుంటుంది. నటీనటులు కొత్త వారైనా చాలా బాగా నటించారు. సత్యానంద్ గారు కూడా నటించారు ఆయన ఎంతోమంది నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చారు. సినిమాకొచ్చిన ఆడియెన్స్ డిజప్పాయింట్ అవ్వరు. 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే దానికి డబల్ మీరు ఎంజాయ్ చేస్తారు, చాలా ట్విస్టులు ఉంటాయి. ఈనెల 25న సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయండి. సినిమా చూసిన వారు అసలు డిజప్పాయింట్ అవ్వరు ఇది నా ఛాలెంజ్." అన్నారు

కీలక పాత్రలో నటించిన విషిక మాట్లాడుతూ.. "దర్శకుడు రవి కష్టాన్ని నేను దగ్గరుండి చూసా ఫైనల్ గా మూవీ రిలీజ్ అవుతుంది. నా రోల్ కి నేను పూర్తి న్యాయం చేశాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అందరిని శాటిస్ఫై చేస్తాము. పారడైజ్ 24న రిలీజ్ అవుతుంది. 25న మా సినిమా విడుదల అవుతుంది. డెఫినెట్ గా విషిక మీ అందరికి గుర్తు వుంటుంది. వైజాగ్ నుంచి వచ్చిన అమ్మాయి హైదరాబాద్ లో తెలుగు ఇండస్ట్రీలో గట్టిగా వుంటుంది రాబోయే ఐదు పది సంవత్సరాలు. కమిటీ కుర్రాళ్లు, కోర్టు చేశాను ఆదరించారు. పారడైజ్ తో ఇంకా డబల్ ఎంటర్టైన్మెంట్ చేస్తాను." అన్నారు. 

హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ.. "మా సినిమా ట్రైలర్ కు మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాని సెప్టెంబర్ 18 బదులు సెప్టెంబర్ 25 కి రిలీజ్ చేస్తున్నాం. ప్యారడైజ్ కి పోటీ వెళ్తున్నావా అని చాలామంది అడిగారు అదేమీ లేదు నేను ఎవ్వరికీ పోటీ వెళ్లడం లేదు. మొన్న జరిగిన ఈవెంట్ లో కూడా నేను చెప్పాను నాని అన్న అంటే నాకు చాలా ఇష్టం అని, అలాగే ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని. నా సినిమా కళ్యాణం కమనీయం జీవితం నాని గారి ప్యారడైజ్ సినిమాతో లాంచ్ అవుతుందని అంటే నాకు చాలా హ్యాపీ గా వుంది. మంచి ఫ్యామిలీ సినిమా కళ్యాణం కమనీయం జీవితం. అందరూ 25న థియేటర్ల కు వచ్చి మా ప్రయత్నాన్ని బ్లెస్ చెయ్యండి." అన్నారు 

హీరోయిన్ సాహితి ఆవంచ మాట్లాడుతూ.. "నేను ఈ సినిమా లో మెయిన్ లీడ్ గా నటించాను. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడు గారికి థాంక్స్. కళ్యాణం కమనీయం జీవితం సినిమా ఈనెల 25 న రిలీజ్ అవుతోంది. చాలా ఎక్సైట్ గా వున్నాను. ప్రేమతో చేసిన ఈ సినిమాని అంతే ప్రేమతో ఆడియన్స్ చూస్తారని ఆశిస్తున్నాను." అన్నారు.

 

 

 

[Kalyanam Kamaneeyam Jeevitham, Khan Durrani, Sahithi Avancha,  Ravi Lokireddy, The Paradise, Telugu Cinema, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com