విక్టరీ వెంకటేష్ తో రొమాన్స్ కు కాజల్ సై
on Mar 2, 2016

చందమామ కాజల్ కు ఈ మధ్య వరస సినిమాలు క్యూ కడుతున్నాయి. కొంత కాలం పాటు సినిమాలు తగ్గడంతో వచ్చి దశాబ్దం దాటేసింది కదా, సీనియర్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్లిపోయినట్టే అనుకున్నారు చాలా మంది. కానీ ఆశ్చర్యంగా మళ్లీ సినిమాల్లో ఆఫర్లు పుంజుకుని పరిగెడుతోంది కాజల్. తాజా సమాచారం ప్రకారం, విక్టరీ వెంకటేష్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది.
ప్రస్తుతం మారుతితో బాబు బంగారంలో బిజిగా ఉన్న వెంకీ ఆ తర్వాత నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల తీయబోయే సినిమాకు ఊకొట్టాడు. హీరోయిన్ పాత్రకు కాజల్ ను సంప్రదించగానే, మరోమాట లేకుండా ఊ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది మిత్రవింద. ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం సినిమాలతో బిజీగా ఉన్న కాజల్, ఈ సినిమా ఒప్పుకోవడం ద్వారా తనను తాను సీనియర్ హీరోయిన్ అనే ఫిక్సైపోయిందా..? తనతో వచ్చిన హీరోయిన్ల బ్యాచ్ లో సీనియర్ హీరోతో ఒప్పుకున్న మొదటి యాక్ట్రెస్ కాజలే కావడం విశేషం. ఈ సినిమాను మల్టీ డైమెన్షన్ సంస్థ నిర్మించబోతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



