కాజల్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది..!
on Jun 11, 2016
వేసవిలో టాలీవుడ్ లో రిలీజైన భారీ సినిమాలు ఏంటి అని అడిగితే, సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం అని చెప్పాలి. ఈ రెండు సినిమాల్లోనూ కాజల్ కు అవకాశం దక్కింది. కానీ విచిత్రంగా రెండూ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సమ్మర్ దెబ్బకొట్టేసిందని ఫీలైపోయి టాలీవుడ్ కు దూరం జరిగిన ఈ భామ, తన హిందీ సినిమా దో లఫ్జోంకీ కహానీ పై ఆశలు పెట్టుకుంది. కొరియన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ కోసం, చాలా కష్టపడి నటించానంటూ ప్రమోషన్లలో చాలా కబుర్లే చెప్పింది. అయితే నిన్న రిలీజైన ఈ మూవీని బాలీవుడ్ జనాలు యావరేజ్ గా డిసైడ్ చేసేశారు.
కాజల్ ఫస్ట్ టైం లిప్ కిస్ అని, కొత్త రకం కథ అని మూవీ టీం చాలా కథలే చెప్పినా, అది కేవలం ఫస్ట్ డే వరకే ఉపయోగపడింది. సినిమా అంచనాలను అందకోవడంలో విఫలమైందంటున్నారు అక్కడి విశ్లేషకులు. ఇలాంటి సినిమాలకు ముఖ్యంగా ఉండాల్సింది ఫీల్. " ఆ లవ్ ఫీల్ ను తెప్పించడంలో దర్శకుడు విఫలమయ్యాడు, హీరో హీరోయిన్స్ ఇద్దరూ బాగానే నటించినా, ఓవరాల్ గా మూవీ ఆడియన్స్ ను మెప్పించలేదు " అంటూ బాలీవుడ్ క్రిటిక్స్ జడ్జిమెంట్ ఇస్తున్నారు. దీంతో సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న చందమామ డీలా పడిపోయింది. ప్రస్తుతానికి టాలీవుడ్ కు రానని చెప్పిన కాజల్, ఏ వుడ్ లో సినిమా చేస్తుందో చూడాలి మరి.