Home

»

Latest News

కాకా ధూమ్ ధమాకా: క్రేజీ కళ్యాణం సాంగ్ రిలీజ్.. అనుపమ మాస్ స్టెప్పులు.!

Sep 12, 2026 7:45PM

అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేష్ వీకే, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "క్రేజీ కళ్యాణం". యారో సినిమాస్ బ్యానర్ పై బూసం జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా నుంచి 'కాకా ధూమ్ ధమాకా' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 

పెళ్లి భరాత్ లో చేసే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఈ సాంగ్ ను ఆడియెన్స్ కు నచ్చేలా రూపొందించారు. ఈ  పాటను సురేష్ బొబ్బిలి మాస్ ట్యూన్ తో కంపోజ్ చేయగా, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా జంగి రెడ్డి పాడారు. సురేష్ బొబ్బిలి ర్యాప్ వోకల్స్ అందించారు. ఈశ్వర్ పెంటి అదిరే స్టెప్పులతో కొరియోగ్రఫీ చేశారు. 

'కాకా ధూమ్ ధమాకా.. లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక. మూడు ముళ్ల సంబరాల ఢోలు బాజా కొట్టు.. కొంగు ముళ్ల సంతోషాల లొల్లే సూపెట్టు..' అంటూ ఈ పాట ఇన్ స్టంట్ గా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. 'కాకా ధూమ్ ధమాకా' పాటలో అనుపమ పరమేశ్వరన్ చేసిన డ్యాన్స్ మూవ్ మెంట్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఆమె చేసిన స్టెప్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా ఉన్నాయి.

 

 

 

[Kaaka Dhoom Dhamaka Song, Crazy Kalyanam Movie, Anupama Parameswaran, Tharun Bascker, Suresh Bobbili Songs, Telugu Songs, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com