కె ర్యాంప్ రికార్డు కలెక్షన్స్.. దివాలి విన్నర్ నిజమేనా!
on Oct 21, 2025

కిరణ్ అబ్బవరం దివాళి కానుకగా ఈ నెల 18 న' కె ర్యాంప్'(K Ramp)తో థియేటర్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కుమార్ అనే క్యారక్టర్ లో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)పెర్ ఫార్మెన్స్ బాగుండటంతో పాటు ఎంటర్ టైన్ మెంట్ జోనర్ బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రివ్యూస్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి.
దీంతో కలెక్షన్స్ పరంగా కె ర్యాంప్ మంచి వసూళ్లనే రాబట్టే దిశగా దూసుకెళ్తుంది. అందులో భాగంగా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 17.5 కోట్ల రూపాయల గ్రాస్ ని అందుకున్నట్టు చిత్ర బృందం అధికారకంగా ప్రకటించింది. కిరణ్ అబ్బవరం కూడా ఎక్స్ వేదికగా అందుకు సంబంధించిన పోస్టర్ ని షేర్ చేసి బ్రేక్ ఎవెన్యూ అయ్యిందని, దివాలి విన్నర్ అనే పోస్టర్ ని షేర్ చేసాడు. మరి మూడు రోజుల్లోనే బ్రేక్ ఎవెన్యూ అయ్యిందంటే కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే కే ర్యాంప్ మంచి వసూళ్లు సాధించే చిత్రంగా నిలబడటం ఖాయమనే అభిప్రాయాన్ని ట్రేడ్ సర్కిల్స్ వ్యక్తం చేస్తున్నాయి.
పైగా కె ర్యాంప్ కి ముందు రోజు విడుదలైన మిత్ర మండలి, తెలుసు కదా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోవడం కె ర్యాంప్ కి కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి. జైన్స్ నాని(Jains nani)దర్శకత్వ ప్రతిభతో పాటు హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ నిర్మాణ విలువలు ప్రతి ఒక్కర్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్ యుక్తి తరేజా(Yukti Thareja)తో పాటు మిగతా నటీనటుల పెర్ ఫార్మెన్స్ కూడా ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



