Home

»

Latest News

NTR: ఎన్టీఆర్ మైండ్ బ్లోయింగ్ లైనప్.. మూడు భారీ సినిమాలతో పాన్ ఇండియా షేక్!

Jul 1, 2026 10:19AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) రాబోయే చిత్రాల లైనప్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేట మొదలుకాబోతోందని స్పష్టమవుతోంది. తారక్ తన తదుపరి చిత్రాల విషయంలో ఒక పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో కేవలం మూడు భారీ క్రేజీ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. ఈ మూడింటిపైనే ఎన్టీఆర్ తన పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ చిత్రాలు గ్లోబల్ స్థాయిలో ఎన్టీఆర్ మార్కెట్‌ను ఊహించని రేంజ్‌కు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ క్రేజీ లైనప్‌లో మొదటిగా చెప్పుకోవాల్సింది మోస్ట్ అవేటెడ్ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్' (Dragon). సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇప్పటికే సెట్స్ పై ఉంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాను రెండు భాగాలుగా (పార్ట్ 1, పార్ట్ 2) ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పార్ట్ 1 విడుదలైన తర్వాత చాలా తక్కువ గ్యాప్‌లోనే పార్ట్ 2 ని కూడా రిలీజ్ చేసేలా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ సోషల్ మీడియాను షేక్ చేయడమే కాకుండా, ఇదొక ట్రెండ్ సెట్టర్ సంచలనం కాబోతుందని నిరూపించింది.

ఈ 'డ్రాగన్' సిరీస్ పూర్తి కాగానే, తారక్ తన తదుపరి భారీ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నారు. తాత్కాలికంగా 'గాడ్ ఆఫ్ వార్' (God of War) అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే నెట్టింట ఒక రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. సుబ్రహ్మణ్య స్వామి పురాణ ఇతిహాస నేపథ్యంలో ఈ కథ సాగనుండటం విశేషం. దర్శకుడు త్రివిక్రమ్ చేస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు, మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కెరీర్ లలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ వండర్ తెరకెక్కబోతోంది.

ఎన్టీఆర్ తదుపరి లైనప్‌లో కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా కూడా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు లేవని స్పష్టమైంది. ఎన్టీఆర్ తన పూర్తి దృష్టిని ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' రెండు భాగాలు, త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్టులపైనే పెట్టనున్నారు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను పూర్తిగా తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తారక్ మాస్ ఇమేజ్‌కు, ఈ ఇద్దరు స్టార్ దర్శకుల మేకింగ్ తోడైతే థియేటర్లలో పూనకాలే అని చెప్పాలి.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com