Home

»

Latest News

ఎన్టీఆర్‌ని దెబ్బ‌కొట్టిన ఆ మూడు సినిమాలు

Sep 29, 2016 12:52PM

జ‌న‌తా గ్యారేజ్ ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌. టాలీవుడ్‌లో నెంబ‌ర్ 3 పొజీష‌న్‌లో ఉన్న సినిమా ఇది. తొలి రెండు స్థానాల్లో బాహుబ‌లి, శ్రీ‌మంతుడు సినిమాలున్నాయి. మూడో స్థానం జ‌న‌తాకి ద‌క్కింది. నిజానికి జ‌న‌తా గ్యారేజ్ శ్రీ‌మంతుడు ని దాటేసి నెంబ‌ర్ 2 స్థానంలో కూర్చుంటుంద‌నుకొన్నారు ట్రేడ్ పండితులు. కానీ.. స్వ‌ల్ప తేడాతో రెండో స్థానాన్ని కోల్పోయింది జ‌న‌తా గ్యారేజ్‌. శ్రీ‌మంతుడు రూ.150 కోట్ల గ్రాస్ వ‌సూలు చేస్తే, జ‌న‌తా 138 కోట్ల ద‌గ్గ‌ర ఆగిపోయింది. అమెరికాలో ఆశించినంత వ‌సూళ్లు రాక‌పోవ‌డం జ‌న‌తాకు దెబ్బ కొట్టింది. అదే అమెరికాలో భారీ వ‌సూళ్ల‌తో.. శ్రీ‌మంతుడు దూసుకుపోయింది.

ఓవ‌ర్సీస్‌లో జ‌న‌తా గ్యారేజ్ ని దెబ్బ‌కొట్టిన అంశాలు చాలా ఉన్నాయి. ప్రీమియ‌ర్ షోల త‌ర‌వాత జ‌న‌తాకు నెగిటీవ్ టాక్ వ‌చ్చింది. రివ్యూలు కూడా అంతంత మాత్రంగానే ఇచ్చారు. ఆ ప్ర‌భావం వ‌సూళ్ల‌పై ప‌డింది. అంతేకాదు.. జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత విడుద‌లైన జ్యో అత్యుతానంత‌, ఇంకొక్క‌డు. మ‌జ్ను చిత్రాలు ఓవ‌ర్సీస్‌లో బాగానే వ‌సూళ్లు ద‌క్కించుకొన్నాయి. ఆ ప్ర‌భావం జ‌న‌తాపై బాగా ప‌డింది. శ్రీ‌మంతుడు స‌మ‌యంలో ఓవ‌ర్సీస్ లో ఆ సినిమాకి పోటీ లేదు. జ‌న‌తా కీ అదే ప‌రిస్థితి ఉంటే.. టాప్ 2లో ఎన్టీఆరే ఉండేవాడు. కానీ చిన్న సినిమాలు మాత్రం ఎన్టీఆర్‌ని ఊహించిన విధంగా దెబ్బ‌తీయ‌డంతో నెం.3తో స‌రిపెట్టుకోవాల్సివ‌చ్చింది. 
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com