Home

»

Latest News

గ్యారేజ్ బాక్స్‌ గలగలలు..

Sep 6, 2016 3:45PM

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంభినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజ్‌కు ఫస్ట్ డే నుంచి పాజిటివ్ ప్లస్ నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే టాక్‌కు కలెక్షన్లకు ఏమాత్రం పోలిక లేకుండా పోతోంది. గ్యారేజ్ విడుదలైన ప్రతిచోటా దుమ్ములేపే కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ కలెక్షన్ల సునామీ ఎలా ఉందంటే వసూళ్ల పరంగా బాహుబలి తర్వాత స్థానంలో నిలిచింది. విడుదలైన నాలుగు రోజులకే 50 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త రికార్డును సృష్టించింది. లాంగ్ వీకెండ్‌తో పాటు వినాయక చవితి కలిసిరావడంతో, టాక్‌తో సంబంధం లేకుండా బాక్షాఫీస్ వద్ద కనకవర్షం కురిసింది. ఈ మేరకు జనతా గ్యారేజ్ 50 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాతలు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఊపు ఇలాగే కొనసాగితే మహేశ్ శ్రీమంతుడిని గ్యారేజ్ క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com