ఎన్టీఆర్ గ్యారేజ్‌లో మహేష్...
on Aug 31, 2016
ఆగండి..మీరేం ఊహించుకోకండి..! గ్యారేజ్‌లో మహేశ్ అంటే సూపర్‌స్టార్ ఎన్టీఆర్ గ్యారేజ్‌లో ఉన్నాడని కాదు. మహేశ్, మురుగదాస్ కాంభినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే చెన్నైలో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తిరిగి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్లో భాగంగా సారధి స్టూడియోలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ కోసం వేసిన సెట్లోనే మహేశ్ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఓ యాక్షన్ సన్నివేశంతో పాటు, పాటను కూడా ఇక్కడే చిత్రీకరించబోతున్నారట. గ్యారేజ్ షూటింగ్ అయిపోయిన వెంటనే సెట్లో మురుగదాస్ చిన్న చిన్న మార్పులు సూచించి దానిని మహేశ్ సినిమా కోసం వాడుతున్నట్లు సమాచారం. సో మొత్తానికి అదన్న మాట.