సారీ బ్రదర్ రామ్‌చరణ్!
on Mar 27, 2020

రామ్‌చరణ్‌కు జూనియర్ ఎన్టీఆర్ సారీ చెప్పాడు. మార్చి 27 చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం పది గంటలకు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాననీ, ఇదెప్పటికీ మరవరానిదిగా ఉంటుందనీ, తనను నమ్మమనీ గురువారం సాయంత్రం తారక్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో శుక్రవారం ఎప్పుడెప్పుడు పది గంటలవుతుందా అని ఫ్యాన్స్ అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తూ వచ్చారు. అయితే పది దాటిపోయింది. ఇంకా 'భీమ్ ఫర్ రామరాజు' సర్‌ప్రైజ్ వీడియో రాలేదు. దీంతో చరణ్‌కు సారీ చెప్పాడు తారక్.
"సారీ బ్రదర్ రామ్‌చరణ్.. నీ గిఫ్ట్‌ను జక్కన్న రాజమౌళికి ఆయన అభిప్రాయం కోసం రాత్రి పంపించాను. రాజమౌళిగా అదెలా వెళ్తుందో నీకు తెలుసు. చిన్నపాటి జాప్యం.." అని తన సోషల్ మీడియాలో తారక్ పోస్ట్ చేశాడు. దీనికి, "ఏమిటీ ఆయనకు పంపించావా? ఈ రోజు అది నాకొస్తుందా?" అని చమత్కరించాడు చరణ్.
చిరంజీవి "నేను వెయిట్ చేస్తున్నా.." అని పోస్ట్ పెడితే, దానికి రాజమౌళి సమాధానం ఇచ్చాడు.. దీనిపై వీళ్ల మధ్య జరిగిన సంభాషణ ఎలా ఉందో చూడండి.



.jpg)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



