Home

»

Latest News

ఎన్టీఆర్ చేతిలో మ‌రో ఆప్ష‌న్‌...!

Nov 17, 2016 11:35AM

జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత ఎన్టీఆర్ సినిమా ఎవ‌రితో అనే స‌స్పెన్స్ ఇంకా కొన‌సాగుతోంది. ఏడెనిమిది ద‌ర్శ‌కుల పేర్లుప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. అయితే ఎవ్వ‌రితోనూ వ‌ర్క‌వుట్ కాలేదు. ఇప్పుడు వినాయ‌క్‌, అనిల్ రావిపూడిల‌లో ఒక‌రికి ఫిక్స‌య్యే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు. అయితే ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడి పేరు వినిపిస్తోంది. ఆయ‌నే హ‌రి. ఈ త‌మిళ ద‌ర్శ‌కుడికి మంచి రికార్డే ఉంది. మాస్ సినిమాల్ని బాగా తెర‌కెక్కిస్తాడ‌ని పేరు తెచ్చుకొన్నాడు. ఇప్పుడు విశాల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయ‌డానికి హ‌రి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ని, ఇదో పోలీస్ స్టోరీ అని తెలుస్తోంది. హ‌రి క‌థ న‌చ్చితే.. ఎన్టీఆర్‌కి ఎలాంటి అభ్యంత‌రం ఉండ‌క‌పోవొచ్చు. ఒక‌ట్రెండు రోజుల్లో.. హ‌రి క‌థ వినిపించే అవ‌కాశాలున్నాయి. క‌థ విన్న త‌ర‌వాత ఎన్టీఆర్ త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే అవ‌కాశం ఉంది. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com