
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పుట్టినరోజు కానుకగా విడుదలైన ‘డ్రాగన్’ (Dragon) ఫస్ట్ గ్లింప్స్ సృష్టించిన భీభత్సం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ నీల్ కట్ చేసిన రా అండ్ రస్టిక్ విజువల్స్ చూసి నందమూరి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. అయితే ఈ మాస్ హై లో ఉండగానే, అభిమానులకు మరో ఊహించని సాలిడ్ సర్ప్రైజ్ ఇచ్చారు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘గాడ్ ఆఫ్ వార్’ (God of War). గత కొద్దిరోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి రకరకాల రూమర్స్ వస్తున్న తరుణంలో, నాగవంశీ తన ట్వీట్ ద్వారా వాటన్నింటికీ ఒక్కసారిగా చెక్ పెట్టారు. తారక్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ.. డ్రాగన్ గ్లింప్స్ అరాచకంగా ఉందంటూనే, ‘అతి త్వరలోనే మనం సెట్స్‌లో కలుద్దాం అన్నా’ అంటూ ట్వీట్ చేసి, 'గాడ్ ఆఫ్ వార్' గురించి హింట్ ఇచ్చారు.
ఈ ట్వీట్‌లో ఆయన ప్రత్యేకంగా ఒక ‘నెమలి’ (Peacock) ఎమోజీని పెట్టడం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. లార్డ్ కుమారస్వామి (కార్తికేయ) బ్యాక్‌డ్రాప్‌లో, పౌరాణిక ఫాంటసీ ఎలిమెంట్స్‌తో త్రివిక్రమ్ ఈ డ్రీమ్ ప్రాజెక్టును ప్లాన్ చేశారనే వార్తలకు ఈ ఎమోజీ మరింత బలాన్ని చేకూర్చింది. ‘డ్రాగన్’ తర్వాత తారక్ ఈ లార్జ్ స్కేల్ మైథలాజికల్ డ్రామా షూటింగ్‌లోనే పాల్గొనబోతున్నట్లు స్పష్టమైంది. ఈ అఫీషియల్ హింట్‌తో ఎన్టీఆర్ లైనప్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.






